Share News

MLA Ramniwas Rawat: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రి అయిన ఎమ్మెల్యే.. ప్రమాణస్వీకారంలో అసాధారణ పరిణామం

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:36 PM

ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఒక్కసారి ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సర్వ సాధారణమైన ఈ ప్రక్రియ మధ్యప్రదేశ్‌లో అసాధారణ రీతిలో జరిగింది. ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేశారు. విచిత్రమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

MLA Ramniwas Rawat: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రి అయిన ఎమ్మెల్యే.. ప్రమాణస్వీకారంలో అసాధారణ పరిణామం
MLA Ramniwas Rawat

ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఒక్కసారి ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సర్వ సాధారణమైన ఈ ప్రక్రియ మధ్యప్రదేశ్‌లో అసాధారణ రీతిలో జరిగింది. ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేశారు. విచిత్రమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే అధికార బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాంనివాస్ రావత్.. సీఎం మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు ఇవాళ (సోమవారం) ఉదయం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణస్వీకారంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రొటీన్‌గా జరగాల్సిన ఈ ప్రక్రియ అసాధారణంగా జరిగింది.


రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యే రాంనివాస్ రావత్ చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్‌ ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రముఖులు అంత చూస్తుండగా ఆయన ప్రమాణం చేశారు. అయితే ఆయన ప్రమాణం చేసింది రాష్ట్ర సహాయ మంత్రిగా అని గుర్తించారు. దీంతో 15 నిమిషాల తర్వాత రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో 15 నిమిషాల వ్యవధిలోనే ఆయన రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. అయితే ఈ విధంగా రెండు సార్లు ప్రమాణం చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానపరమైన లోపాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.


మరో విశేషం ఏంటంటే.. సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో అసాధారణ రీతిలో సహాయ మంత్రి, కేబినెట్ మంత్రిగా ఉన్నట్టు అయింది. తప్పుగా ప్రమాణస్వీకారం దీనంతటికి కారణమైంది. కాగా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న తొలి నేత రాంనివాస్ రావత్ కావడం విశేషం. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. రావత్ ఇంకా కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేయలేదని మండిపడింది. విజయపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన పార్టీ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అతడిని బీజేపీ సభ్యుడిని చేశారని, మంత్రి పదవి కూడా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రావత్‌ని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.


కాగా ప్రమాణస్వీకారంలో గందరగోళం, కాంగ్రెస్ విమర్శలను పక్కన పెట్టిన ఎమ్మెల్యే రాంనివాస్.. తనను మంత్రిని చేసిన బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి కూడా మొదలుపెట్టారు. తనపై ఆరోపణలు చేసే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ‘‘వాళ్లు నాకు ఏమీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నన్ను గౌరవించింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పొరపాటున రెండుసార్లు ప్రమాణం చేశానని, అరగంటలో రెండుసార్లు ప్రమాణం చేసిన మొదటి మంత్రిని తానేనని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. కాగా షియోపూర్ జిల్లాకు చెందిన ఆయన ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. గతంలో దిగ్విజయ్ సింగ్ హయాంలో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

ఇవి కూడా చదవండి

నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాటిని కోల్పోతారన్న ధర్మాసనం

మిరాకిల్.. రైలు కింద పడి.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ

For Nationa News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 04:04 PM