ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farmers Protest: వారు నేరస్థులు కారు.. దేశానికి అన్నం పెట్టేవారు.. మధుర స్వామినాథన్ ఆవేదన..

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:45 PM

తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు. రైతుల నిరసనపై హర్యానా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె ఖండించారు. వారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అని తెలిపారు. తన తండ్రి ఎంఎస్ స్వామినాథన్ కు మరణానంతరం భారతరత్న పురస్కార ప్రదానం సందర్భంగా దిల్లీలోని పూసాలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.

"పంజాబ్ కు చెందిన రైతులు పాదయాత్ర చేస్తున్నారు. హర్యానాలో వారి కోసం జైళ్లు సిద్ధమవుతున్నాయి. వారు దిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు నిర్మించారు. ఆందోళనను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు రైతులు మాత్రమే.. నేరస్థులు కాదు. నేను అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా. మనం అన్నదాతలతో మాట్లాడాలి. ఆందోళనను అణిచి వేసేందుకు ప్రయత్నాలు చేయకుండా పరిష్కార మార్గాలు వెతకాలి." అని మధుర స్వామినాథన్ అన్నారు.


మరోవైపు.. కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో రైతులు చలో దిల్లీ మార్చ్ చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణ మాఫీ, పోలీసు కేసుల పరిష్కారం, బాధితులకు న్యాయం వంటి పలు అంశాలు రైతుల డిమాండ్‌లో ఉన్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 01:45 PM

Advertising
Advertising