ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

World Record: మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైన చెఫ్.. అసలు విషయం ఇదే..

ABN, Publish Date - Oct 28 , 2024 | 05:44 PM

మహరాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ దీపావళి రోజున ఒకవేళ 10వేల దోసెలు వండగలిగితే ఆయన 26వ రికార్డును నెలకొల్పినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన పేరు మీద ఏకంగా 25 రికార్డులు ఉన్నాయి.

నాగ్‌పూర్: అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ చెఫ్ విష్ణు మనోహర్ మరో రికార్డు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రపంచ రికార్డులు ఆయన సొంతం కాగా, దీపావళి రోజు మరో కొత్త రికార్డు సృష్టించేందుకు ముందగుడు వేశారు. 24 గంటల్లో ఏకంగా 10వేల దోసెలు తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాలని మనోహర్ నిర్ణయించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నిజంగా ఇది సాధ్యమవుతుందా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా విష్ణు మనోహర్ 7వేల కిలోల రామ్ హల్వాను తయారు చేశారు. అలాగే కార్యక్రమం మెుదలైన మూడు గంటల్లోనే ఏకంగా 2వేల దోసెలు తయారు చేశారు. అంటే సగటున గంటకు 800 దోసెలు తయారు చేసి భక్తులకు అందించారు.


మహరాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ దీపావళి రోజున ఒకవేళ 10వేల దోసెలు వండగలిగితే ఆయన 26వ రికార్డును నెలకొల్పినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన పేరు మీద ఏకంగా 25 రికార్డులు ఉన్నాయి. నాగ్‌పూర్‌లో 52 గంటలపాటు నిరంతరాయంగా ఎక్కువ సేపు వంట చేసిన చెఫ్‌గా మనోహర్ గతంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీన్ని యూకే (UK) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. యూకేకు చెందిన 60 మంది పరిశీలకుల బృందం 52గంటలపాటు ఆయన 750 కంటే ఎక్కువ వంటకాలు సిద్ధం చేస్తుండగా పరిశీలించింది. ఆ సమయంలో 15మంది సహాయకులతో మనోహర్ ఏకకాలంలో ఎనిమిది స్టవ్‌లను ఉపయోగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.


అయితే ఈ సందర్భంగా చెఫ్ విష్ణు మనోహర్ మాట్లాడుతూ.." రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా నేను పని చేయడం లేదు. నేను చేస్తున్న పనుల వల్లే రికార్డులు నమోదు అవుతున్నాయి. అన్నదానం చేయడం అతి పెద్ద దానమని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన స్ఫూర్తితోనే ఈ పనులు చేస్తున్నా. దీపావళి వేడుకలో భాగంగా మాత్రమే 10 వేల దోసెల లక్ష్యం పెట్టుకున్నా. నేను 24 గంటల్లో 10 వేల దోసెలు తయారు చేస్తే అది నా 26వ రికార్డు అవుతుంది. నేను 24 గంటలపాటు దోసెలు తయారు చేయగలను. దీనికి ముందే నేను పెద్ద పరిమాణంలో ఖిచ్డీ, బైంగన్, మిసాల్ వంటి పదార్థాలను వండాను. నేను గంటకు దాదాపు 750 నుంచి 800 దోసెలు చేస్తాను. కాబట్టి సగటున సుమారు 10 వేల దోసెలు చేయగలుగుతా" అని చెప్పారు.


ఈ ప్రపంచ రికార్డును నాగ్‌పూర్‌లోని తన ప్రముఖ ఫుడ్ జాయింట్ "విష్ణుజీ కీ రసోయ్‌"లో నిర్వహించనున్నట్లు విష్ణు మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం 300 కిలోలకు పైగా దోస పిండిని సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. చనగపప్పు, మినప్పప్పుతో దోసెలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వెయ్యి కిలోల చట్నీనీ తయారు చేయనున్నట్లు విష్ణు మహోహర్ తెలిపారు. ఆయన మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాలని భారతీయులుగా కోరుకుందాం..


ఈ వార్తలు కూడా చదవండి:

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Bandra Stampede: తొక్కిసలాటకు ముందు జరిగిందిదే.. సీసీటీవీ ఫుటేజ్ వెల్లడి

Updated Date - Oct 28 , 2024 | 05:47 PM