Bharat Ratna: నితీష్, నవీన్‌లకు భారతరత్న ఇవ్వాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 07:53 PM
Bihar CM Nitish Kumar, Odish Ex CM Naveen Patnaik: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బెగుసరాయ్, డిసెంబర్ 25: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లకు భారతరత్న ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. బుధవారం బెగుసరాయ్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బిహార్ రాష్ట్రాభివృద్ధి కోసం నితీష్ పని చేస్తున్నారన్నారు. అలాగే నవీన్ పట్నాయక్ సైతం ఎన్నో ఏళ్లుగా ఒడిశా అభివృద్ధి కోసం పాటు పడ్డారని పేర్కొన్నారు. అలాంటి వీరిద్దరిని భారతరత్న వంటి పురస్కారాలతో గౌరవించాలని తెలిపారు.
రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి నితీష్ పాలన కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 30 ఏళ్లు నిండిన నేటి యువకులకు లాలూ జీ జంగిల్ రాజ్ చూడలేదని చెప్పారు.
ఇక కేంద్ర మంత్రి, జేడీ యూ నేత రాజీవ్ రంజన్ సింగ్ సైతం మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు.
అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే కూటమి తన సత్తా చాటలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య క్షాలైన బిహార్‌లో బీజేపీ, జేడీ (యూ), ఎల్జీపీ (రామ్ విలాస్ పాశ్వాన్), హిందూస్థానీ అవామీ మోర్చా(సెక్యూలర్) పార్టీలు కలిసి పోటీ చేశాయి.
Also Read: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
Also Read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
Also Read: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ
మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీయే కూటిమి కొన్ని స్థానాలను మాత్రమే దక్కించుకో గలిగింది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని సీఎం నితీష్ కుమార్ కూల్చివేశారు. అనంతరం మళ్లీ బీజేపీతో ఆయన చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. వాటిలో బీజేపీ 84 స్థానాలను గెలుచుకోగా.. నితీష్ నేతృత్వంలోని జేడీ (యూ) 48 స్థానాలను గెలుచుకొంది. దీంతో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో బిహార్‌లో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2025 ఏడాది చివర నాటికి బిహార్ అసెంబ్లీకి నగారా మోగనుంది.
Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ
Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి
మరోవైపు ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో దశాబ్దాలుగా సాగుతోన్న నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజు జనతా దళ్ పాలనకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఒడిశా సీఎంగా, బీజేపీ నేత మోహన్ చరణ్ మాంఝీ బాధ్యతలు చేపట్టారు.
For National News And Telugu News
Updated Date - Dec 25 , 2024 | 07:58 PM