Farooq Abdullah: ముస్లింలకు భద్రత లేదు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 02 , 2024 | 06:34 PM
మతం ఆధారంగా వివక్ష అనేది రాజ్యాంగంలో లేదని, కేంద్రం ఒక విషయం గుర్తుంచుకోవాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక ఇండియా అనేది ఎక్కడుంటుందని ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు.
శ్రీనగర్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే భారత్‌కూ బంగ్లాదేశ్‌కూ తేడా ఏమిందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) సైతం ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలు అభద్రతాభావంతో ఉన్నారని, రాజ్యాంగం హామీ ఇచ్చినట్టుగా మతం ఆధారంగా వివక్ష ఉండరాదని అయన వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ముస్లింల పట్ల విపక్ష చూపరాదన్నారు.
Maharashtra: బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని
దేశంలోని మందిరాలు, మసీదుల విషయంలో ఇటీవల జరుగుతున్న వరుస వివాదాలపై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో సోమవారంనాడు మాట్లాడారు. ''ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని తక్షణం ఆపాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 24 కోట్ల ముస్లింలను సముద్రంలోకి నెట్టేయలేరు. వారు (ప్రభుత్వం) ముస్లింలను సమానంగా చూడాలి. మతం ఆధారంగా వివక్ష అనేది రాజ్యాంగంలో లేదు. వాళ్లు (బీజేపీ సారథ్యంలోని కేంద్రం) ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లు కనుక రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక ఇండియా అనేది ఎక్కడుంటుంది?'' అని ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు.
దిగువ కోర్టుల ఆదేశాలపై సుప్రీం దృష్టిపెట్టాలి: కాంగ్రెస్
కాగా, ప్రార్థనా స్థలాల సర్వేలకు దిగువ కోర్టులు అనుమతిస్తుడటంపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సోమవారంనాడు అన్నారు. ఇలాంటి క్లెయిమ్స్‌కు సుప్రీంకోర్టు చరమగీతం పాడాలని, లేదంటే దేశంలో 'అరాచకం' తలెత్తుతుందని అన్నారు. దేశంలో అరాచకవాదానికి తావీయరాదని ఆరాధనా స్థలాల ప్రతేక నిబంధన చట్టం-1991 చెబుతోందని తెలిపారు. ఆరాధనా స్థలాల సర్వేలకు అనుమతిస్తూ దిగువ కోర్టులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అల్లకల్లోలం తలెత్తుతుందని, ప్రతినిత్యం దిగువ కోర్టులు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన తప్పుపట్టారు. ఆలయం, మసీదు, చర్చిల కింద ఏదో ఉందంటూ ఎవరో ఒకరు చెబుతుండటం, దిగువ కోర్టులు ఆదేశాలిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. ఇది చాలా సీరియస్ అంశమని, దీనికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాలని కోరారు. కాగా, ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు కోరుతూ వేస్తున్న పిటిషన్లను అనుమతించకుండా దిగువ కోర్టులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు అలోక్ శర్మ, ప్రియా మిశ్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆరాధానా స్థలాల చట్టం-1991కు లోబడి వ్యవహరించేలా రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కూడా పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఇది కూడా చదవండి
Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ
Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..
Read More National News and Latest Telugu News