ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఒడిశాలోనూ డబల్ ఇంజిన్ సర్కార్.. సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చానన్న మోదీ

ABN, Publish Date - May 06 , 2024 | 12:23 PM

ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.

భువనేశ్వర్: ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఒడిశాలో బీజేపీ డబల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


"రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని మీ ఉత్సాహం తెలియజేస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందించడానికి నేను ఒడిశా వచ్చాను. అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన హమీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాం. ఇది మోదీ హామీ. ఇక్కడ అధికారంలో ఉన్న బిజు జనతా దళ్(BJD) ప్రభుత్వ గడువు జూన్ 4తో ముగుస్తుంది. జూన్ 10న భువనేశ్వర్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇవాళే మీ అందరినీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా" అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు..

ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని.. పేదల సంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిందని.. అందుకు బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు బాధ్యులని అన్నారు.

రాష్ట్రంలో 50 ఏళ్లు కాంగ్రెస్, 25 ఏళ్లు బీజేడీ పాలించాయని.. పేదల సంఖ్య పెరగడంపై ఆయా పార్టీలు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలని మోదీ కోరారు. ఒడిశాలో మే 13న ఒకేసారి అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 12:24 PM

Advertising
Advertising