ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: శరీరం రంగు చూపి ప్రజలను అవమానిస్తారా?.. శామ్ పిట్రోడాపై మోదీ నిప్పులు

ABN, Publish Date - May 08 , 2024 | 03:54 PM

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతివివక్ష' వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు.

వరంగల్: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా (Sam pitroda) చేసిన 'జాతివివక్ష' (racist) వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మండిప్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తోందో ఇప్పుడు తనకు అర్ధమవుతోందని అన్నారు.

Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు...మాకు సంబంధం లేదన్న కాంగ్రెస్


''ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ. ఆ కారణంగానే ఆమెను ఓడించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేసింది. అందుకు కారణం ఏమిటో ఈరోజు అర్ధమైంది. అమెరికాలో ఒక అంకుల్ ఉన్నారు. ఆయన షెహజాదా (రాహుల్)కు ఫిలాసఫికల్ గైడ్. క్రికెట్‌లో మూడో ఎంపైర్‌లా షెహజాద్ ఈ థర్డ్ ఎంపైర్ నుంచి సలహాలు తీసుకుంటారు. నలుపు రంగు చర్మం ఉన్నవారు ఆఫ్రికా నుంచి వచ్చినట్టు ఈ ఫిలాసోఫికల్ అంకుల్ చెబుతున్నారు. అంటే రంగు పేరుతో మీరు ఈ దేశ ప్రజలను అవమానిస్తున్నారని అర్థం. దీనిపై ప్రజలకు రాహుల్ సమాధానం ఇవ్వాలి. ఒంటి రంగు పేరు చెప్పి దేశ ప్రజలను అవమానిస్తే దేశం సహించదు. దీనిని మోదీ ఎంతమాత్రం సహించరు'' అని ప్రధాని స్పష్టం చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 03:55 PM

Advertising
Advertising