Share News

Chandrababu: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?

ABN , Publish Date - May 14 , 2024 | 07:29 AM

ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది.

Chandrababu: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?
chandrababu

ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


కాగా ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కి మోదీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.


దీంతో చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం సాయంత్రం విజయవాడకు బయలుదేరి వస్తారు.


వారణాసిలో మోదీ భారీ రోడ్‌షో

కాగా వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం ఆరు కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 11:31 AM