మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..

ABN, Publish Date - May 28 , 2024 | 10:02 AM

‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌)(Pakistan) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను(Kejriwal) ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) వ్యాఖ్యానించారు.

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..
PM Modi

న్యూఢిల్లీ, మే 28: ‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌)(Pakistan) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను(Kejriwal) ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు వంటి పలు సందర్భాల్లో రాహుల్‌, కేజ్రీవాల్‌కు పాకిస్థాన్‌ ఎందుకు మద్దతు పలికిందని ప్రశ్నించారు. రాహుల్‌, కేజ్రీవాల్‌లను పొగుడుతూ పాకిస్థాన్‌ మాజీ మంత్రి చౌధరీ ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.


ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ దీనిపై స్పందిస్తూ.. భారతీయ ఓటర్లకు చాలా పరిణతి ఉందని, సరిహద్దు ఆవలి వారు చెప్పే మాటలను వారు వినబోరని అన్నారు. అయితే, ఎన్నికల్లో విదేశీ జోక్యం మాత్రం దర్యాప్తు చేయాల్సిన తీవ్రమైన అంశమని అన్నారు. ‘‘దర్యాప్తు సంస్థలు అవినీతి తిమింగలాలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుంటున్నాయని తప్పుపట్టేవారు. ఇప్పుడు మేం తిమింగలాలను పట్టుకుంటే, వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే, కొంతమంది అవినీతిపరులను గొప్పవాళ్లుగా కీర్తిస్తున్నారు. అవినీతిపరులకు మద్దతు పలకడం, వాళ్లు జైలు నుంచి వచ్చినప్పుడు సంబరాలు చేసుకోవడం ఇటీవల ఫ్యాషన్‌గా మారింది’’ అని మోదీ అన్నారు.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 10:02 AM

Advertising
Advertising