ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge Birthday: ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్, ప్రియాంక, రేవంత్, భట్టి, షర్మిల

ABN, Publish Date - Jul 21 , 2024 | 12:06 PM

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.

పుట్టిన రోజు సందర్భంగా ఖర్గేకు ప్రధాని మోదీ, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.


"కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా" అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. "ప్రజల కోసం మీరు చేసే నిర్విరామ సేవ, అంకితభావం నాకు ప్రేరణగా నిలిచింది. జన్మదిన శుభాకాంక్షలు. మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


రాజకీయ జీవితం..

ఖర్గే తన కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. రాజకీయ జీవిత తొలినాళ్లలో లా డిగ్రీని పూర్తి చేసిన తర్వాత.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న మాజీ జస్టిస్ శివరాజ్ వి పాటిల్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. 1972లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గుర్మిత్‌కల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

అలా 1972, 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2008, 2009 ఎన్నికల్లో వరుసగా 9 సార్లు గెలిచి విజయానికి కేరాఫ్‌గా మారారు. 2005లో ఖర్గే.. సాహెబ్ కర్నాటక రాష్ట్ర అధ్యక్ష కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2022 అక్టోబర్ 18న కాంగ్రెస్ పార్ట జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


ఆ సమయంలో ఖర్గేకు పోటీగా కేరళ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పోటీ పడ్డారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ నిర్వహించగా, మొత్తం 9,385 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, ఖర్గేపై పోటీ చేసిన శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి.

24 ఏళ్ల తర్వాత గాంధేతర కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఓట్లు చీలకుండా అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి విపక్షాన్ని ఖర్గే ముందుండి నడిపించారు. అలా లోక్ సభలో 99 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలిచింది.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 12:07 PM

Advertising
Advertising
<