Share News

Farmers Protest: శంభు సరిహద్దుల్లో మరోసారి ఉద్రికత.. బాష్పవాయువు, జల ఫిరంగులతో అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:41 PM

కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Farmers Protest: శంభు సరిహద్దుల్లో మరోసారి ఉద్రికత.. బాష్పవాయువు, జల ఫిరంగులతో అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: రైతులు మరోసారి 'ఢిల్లీ చలో' మార్చ్ తలపెట్టడంలో పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతంలోని శంభు (Haryana -Punjab Shambu Border) వద్ద శనివారం మధ్యాహ్నం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శకులు ముందుకు రాకుండా బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. తమ డిమాండ్ల సాధనం కోసం రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం శనివారంతో 307వ రోజుకు చేరింది.

Temple reopened: 45 ఏళ్ల తరువాత తెరుచుకున్న శివాలయం


భద్రతా కారణాలను ఉటంకిస్తూ రైతులు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో.. శాంతియుతంగా తాము ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తామని రైతు నేతలు విజ్ఞప్తి చేశారు. ''మా నిరసనలకు అడ్డుపడకండి. మాకు వెళ్లేందుకు రోడ్డు ఇవ్వండి. ఇనుప బారికేడ్లు, రాతి బారికేడ్లు మా గొంతును అణిచివేయలేవు'' అని రైతు నేత ఒకరు విజ్ఞప్తి చేశారు. దేశంలోని 50 శాతం రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వారి గొంతును అణిచివేయలేరని చెప్పారు. ఖనౌరి సరిహద్దు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర) రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం ప్రధానితో సహా అందరి కళ్ల ముందే క్షీణిస్తోందని ఆయన వాపోయారు. తాము జెండాలు, దుస్తులతో మాత్రమే చలో ఢిల్లీ వెళుతున్నామని, కావాలంటే తమను క్షుణ్ణంగా సోదాలు చేసుకోవచ్చని, తాము కేవలం సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్తున్నామని ఆయన వివరించారు.


అనుమతి తెచ్చుకుంటేనే...

రైతు నేతల విజ్ఞప్తులపై అంబాలా ఎస్‌పీ స్పందిస్తూ, రైతులు ఢిల్లీకి వెళ్లాలనుకుంటే తగిన అనుమతి తీసుకోవాలని, అప్పుడు వారిని అనుమతించేదుకు అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, శనివారం మళ్లీ ఢిల్లీ చలో యాత్రను చేపడుతున్నట్టు రైతు నేతలు ప్రకటించడంతో హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. సరిహద్దుల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించింది. సుప్రీంకోర్టు విచారణకు కొంత సమయం పడుతుందని, అందువల్ల రైతులు తాత్కాలికంగా తమ నిరనలు తెలిపివేయాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ శనివారంనాడు కోరారు.


ఇవి కూడా చదవండి..

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన నోటీసు

For National News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 03:42 PM