ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

President Draupadi Murmu : తీర్పు వచ్చే సరికి తరం మారుతోంది

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:25 AM

కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.

  • వాయిదాల సంస్కృతిని మార్చండి

  • కోర్టు అంటేనే సామాన్యుల్లో భయం

  • దీనిపై అధ్యయనం చేయండి

  • న్యాయ వ్యవస్థకు ముర్ము హితవు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. దీనిపై తొలుత దృష్టి పెట్టాలని న్యాయవ్యవస్థకు సూచించారు. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో ఆమె ప్రసంగించారు. పెండింగ్‌ కేసులు ‘మనందరికీ’ పెద్ద సవాలుగా మారాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే తొలుత కేసుల విచారణను వాయిదా వేసే విధానంలో మార్పులు రావాలని చెప్పారు.

అత్యాచారం వంటి కేసుల్లోనూ తీర్పులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అత్యాచారం వంటి కేసుల్లోనూ తీర్పులు వచ్చేసరికి తరం మారుతోంది. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందని సామాన్యులు అనుకుంటున్నారు’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని ప్రజలు న్యాయాలయాలను దేవాలయాలుగా భావిస్తున్నారని అన్నారు. ‘‘దేవుని ఇంట్లో ఆలస్యం జరుగుతుందేమోగానీ, అన్యాయం మాత్రం జరగదని నమ్ముతుంటారు.

కానీ ఈ అలస్యం ఎంత కాలం? మనమంతా దీనిపై ఆలోచించాలి’’ అని హితవు చెప్పారు. ‘‘కొందరికి న్యాయం లభించే సమయానికి వారి ముఖాల్లో నవ్వులు కనిపించడం లేదు. కొందరి జీవితాలు అంతమవుతున్నాయి. దీనిపై మనమంతా దృష్టి పెట్టాలి’’ అని అన్నారు. కోర్టు రూముల తీరుపైనా రాష్ట్రపతి అన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోర్టు రూముల సెట్టింగ్‌ను చూడగానే సామాన్యుల్లో ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. దీనికి ‘నల్ల కోర్టు లక్షణం’ (బ్లాక్‌ కోర్ట్‌ సిండ్రోం) అన్న పేరు పెట్టారు. దీనిపై అధ్యయనం జరగాలని సూచించారు. న్యాయాధికారుల పోస్టుల్లో మహిళల సంఖ్య పెరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.


మహిళలకు సౌకర్యాలేవీ: సీజేఐ

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రసంగిస్తూ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళా అధికారులు, న్యాయవాదులకు తగిన సౌకర్యాలు లేవని చెప్పారు. కేవలం 6.7శాతం కోర్టుల్లోనే మహిళలకు కనీస సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 60-70 శాతం మేర మహిళలను న్యాయాధికారులుగా భర్తీ చేస్తున్నారని, అలాంటప్పుడు వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని చెప్పారు.

Updated Date - Sep 02 , 2024 | 04:26 AM

Advertising
Advertising