‘బుల్డోజర్ న్యాయం’ సరి కాదు: ప్రియాంక
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:22 AM
బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిని వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ‘బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిని వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారన్న కారణంతో మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయడంపై స్పందిస్తూ ఈ డిమాండ్ చేశారు.
‘‘నేరం చేసినట్టు ఎవరిపైనైనా ఆరోపణలు ఉంటే కోర్టు మాత్రమే వారికి శిక్ష విధిస్తుంది. ఆరోపణలు వచ్చీ రాగానే నిందితుడి ఇల్లు కూల్చివేసి, మొత్తం కుటుంబానికి నిలువ లేకుండా చేయడం కోర్టులను ధిక్కరించడం కిందికే వస్తుంది. ఇది అన్యాయం.
కిరాతకానికి పరాకాష్ఠ. ప్రభుత్వమే క్రిమినల్స్ మాదిరిగా వ్యవహరించకూడదు’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలే లక్ష్యంగా బుల్డోజర్లను ప్రయోగిస్తుండడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Aug 25 , 2024 | 04:22 AM