Kenya Parliament : కెన్యాలో జనాగ్రహం.. పార్లమెంటుకు నిప్పు
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:37 AM
అసలే ధరల పెరుగుదల కారణంగా బతకడమే కష్టమవుతున్న సమయంలో పన్నుల భారాన్ని కూడా మోపడాన్ని నిరసిస్తూ కెన్యా దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రొట్టెలు, వంటగ్యా్‌సపైనా పన్ను వేయడంతో
నైరోబీ, జూన్ 25: అసలే ధరల పెరుగుదల కారణంగా బతకడమే కష్టమవుతున్న సమయంలో పన్నుల భారాన్ని కూడా మోపడాన్ని నిరసిస్తూ కెన్యా దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రొట్టెలు, వంటగ్యా్‌సపైనా పన్ను వేయడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. సహనం కోల్పోయిన జనం మంగళవారం ఏకంగా పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. భవనంలోని ఒక భాగంలో మంటలు వ్యాపించాయి. పన్నుల పెంపునకు సంబంధించిన ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ గందరగోళం నడుమే ఆ బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంటు బయట ఉద్యమకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేయడానికి కాల్పులు జరపడంతో కనీసం పది మంది మరణించారు.