Share News

Electricity Department: విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్.. వేల కనెక్షన్లు కట్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 09:03 PM

విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొన్ని వేల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. మరికొద్దిరోజుల్లో అమలు చేయనుంది.

Electricity Department: విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్.. వేల కనెక్షన్లు కట్..
Electricity Department

ఎండాకాలం వచ్చింది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఉండాలంటే భయపడాల్సి వస్తోంది. రాత్రిళ్లు ఉక్కపోత కారణంగా నరకం చూడాల్సి వస్తోంది. అలాంటి ఈ టైంలో మీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ లేకుండా పోతే ఏమవుతుందో ఓ సారి ఆలోచించండి. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ.. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా కొన్ని వేల ఇళ్లకు కనెక్షన్‌లు కట్ అవ్వనున్నాయి. ఇందుకోసం విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఆ పది వేల ఇళ్లకు కనెక్షన్లు కట్ అవ్వనున్నాయి. ఇంతకీ ఎందుకు విద్యుత్ శాఖ ఆ ఇళ్లకు కనెక్షన్లు తీసేస్తోంది? అంత పెద్ద తప్పు ఏం జరిగింది?.. ఆ వివరాలు తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేసేయండి.


ఎంతకీ వినకపోవటంతో..

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన లక్షా 64 వేల మంది విద్యుత్ వినియోగదారులు గత కొన్ని నెలలనుంచి బిల్లులు కట్టడం లేదు. దాదాపు 3 కోట్ల రూపాయలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్ శాఖ వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2024 డిసెంబర్ 15వ తేదీనుంచి 2025 జనవరి 28 వరకు ఈ స్కీమ్ కొనసాగింది. బిల్లులు కట్టుకోవటంలో చాలా వెసులు బాటు కల్పించింది. ఈ స్కీమ్‌లో భాగం అవ్వాలనుకునేవారు ముందుగా.. పెండింగ్ ఉన్న బిల్లులో 30 శాతం కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దాన్ని సెప్టెంబర్ 30 తేదీ లోపల చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఒకేసారి లేదా.. ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా కట్టుకునే వెసులు బాటు ఉంటుంది.


విద్యుత్ శాఖ ప్రతీ గ్రామంలో క్యాంపులు పెట్టి మరీ స్కీము గురించి వివరించింది. అయినా కూడా జనం బిల్లులు కట్టడానికి సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేల రూపాయల కంటే ఎక్కువ బిల్లులు ఉన్న వారి కనెక్షన్ తీసేయడానికి సిద్ధమైంది. అంతేకాదు.. వారిపై పోలీస్ కేసులు కూడా నమోదు అవ్వనున్నాయి. ఇక, జిల్లాలో సిటీల వారీగా విద్యుత్ బకాయిలు చూసుకుంటే.. ఫిరోజాబాద్లో 36,189 మంది వినియోగదారులు 749458 లక్షలు చెల్లించాల్సి ఉంది. సిఖోహాబాద్లో 23,975 మంది వినియోగదారులు 483504 లక్షలు చెల్లించాల్సి ఉంది. శీర్షాగంజ్లో 31,187 మంది 723704 లక్షలు చెల్సించాల్సి ఉంది. జర్సానాలో 44376 మంది వినియోగదారులు 936780 లక్షలు చెల్లించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Aadhar Link With Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా

Updated Date - Mar 18 , 2025 | 09:03 PM