Pune: ట్రెయినీ కలెక్టర్ పూజ తల్లిపై కేసు నమోదు
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:01 AM
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
పుణె, జూలై 13: వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి పుణెలోని పాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పూజ తండ్రి దిలీప్ ఖేద్కర్ ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న సమయంలో ధాడ్‌వాలీ గ్రామంలో కొంత భూమిని కొన్నారు. అయితే దాని పక్కనున్న రైతుల భూమిని ఖేద్కర్ కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏడాది కింద మనోరమ బౌన్సర్లతో అక్కడికెళ్లి తుపాకీతో హల్‌చల్ చేస్తూ ఓ రైతును బెదిరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో దిలీ్‌పతో పాటు మరో ఐదుగురిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Updated Date - Jul 14 , 2024 | 04:01 AM