ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pune : ఓబీసీ కోటాలోనే పూజకు ఎంబీబీఎస్‌ సీటు!

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:18 AM

వివాదాస్పద ఐఏఎస్‌ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్‌ ఇతర వెనుక బడిన వర్గం(ఓబీసీ) కోటా ద్వారానే ఎంబీబీఎస్‌ సీటును సంపాదించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌ టెస్టులో 146/200 పొందిన ఆమె పుణే కాశీబాయి ....

పుణే, జూలై 14: వివాదాస్పద ఐఏఎస్‌ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్‌ ఇతర వెనుక బడిన వర్గం(ఓబీసీ) కోటా ద్వారానే ఎంబీబీఎస్‌ సీటును సంపాదించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌ టెస్టులో 146/200 పొందిన ఆమె పుణే కాశీబాయి నవాలే వైద్య కళాశాలలో 2007లో వంజారీ వర్గం కోటాలో సీటు సంపాదించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే పూజా ఖేద్కర్‌ ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు పొందినప్పుడు ఆమె తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ మహారాష్ట్రలో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఇటీవల పుణేలో ప్రొబెషనరీ ఐఏఎస్‌ అధికారిగా ఉన్నప్పుడు ఆమె వాడిన ఆడీ కారును పోలీసులు ఆదివారం జప్తు చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆమె కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను వాడడం, 21 సార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 03:18 AM

Advertising
Advertising
<