Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:32 PM
రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు చర్యలు చేపట్టారు.
పుణె, జులై 15: రైతులను తుపాకీతో బెదిరించిన కేసులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా పుణెలోని దిలీప్ ఖేద్కర్ నివాసానికి సోమవారం పోలీస్ బృందాలు చేరుకున్నాయి. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ యా బృందాలు వెను తిరిగాయి.
అనంతరం పుణెలో పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పూజా తల్లిదండ్రులు దిలీప్ ఖేద్కర్‌తోపాటు మనోరమా ఖేద్కర్ పరారీలో ఉన్నారన్నారు. వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించామని చెప్పారు. కానీ వారి ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లుగా సమాధానం వస్తుందన్నారు. దీంతో వారి నివాసానికి పలుమార్లు వెళ్లేతే.. తాళం పెట్టి ఉందన్నారు. ఈ కేసులో ఖేద్కర్ కుటుంబం ఏ మాత్రం విచారణకు సహకరించడం లేదని పుణె పోలీసులు పెదవి విరిచారు. వారి కోసం.. స్థానిక క్రైమ్ బ్రాంచ్‌తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లోని అధికారులతో పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పుణె పరిసర ప్రాంతాలతోపాటు వారి ఫార్మ్‌హౌస్‌ల్లో సైతం గాలిస్తున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. వారు చెప్పే సమాధానం ఆధారంగా మనోరమా ఖేద్కర్, దిలీప్ ఖేద్కర్‌లపై తదుపరి చర్యలు ఉంటాయని పుణె పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక తుపాకీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ.. మనోరమకు పుణె పోలీసులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు
పుణె ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా.. తనకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు, కార్యాలయంలో సిబ్బందితోపాటు కానిస్టేబుల్‌ను సైతం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకు వచ్చింది. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ లేని సమయంలో ఆయన ఛాంబర్‌ను కూడా ఆక్రమించింది.
ఆ క్రమంలో ఆయన నేమ్ బోర్డ్ తీసి.. తన నేమ్ బోర్డ్ తగిలించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పూజా ఖేద్కర్ వ్యవహారంపై నివేదిక అందజేయాలని పుణె జిల్లా కలెక్టర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ నివేదిక అందజేయడంతో.. పూజా ఖేద్కర్‌ను వాషిమ్ ట్రైనీ కలెక్టర్‌గా బదిలీ చేసింది.
Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్
మరోవైపు ఈ వ్యవహారం మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో పూజా ఖేద్కర్ తల్లి మనోరమా రైతులను తుపాకీతో బెదిరిస్తున్న ఓ వీడియో హల్‌చల్ చేసింది. దీంతో తనను మనోరమ తుపాకీతో బెదిరించిందంటూ.. ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌ను అరెస్ట్ చేసేందుకు పుణె పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News