ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: ఏది కావాలంటే అది మోదీతో చెప్పించగలను.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - May 18 , 2024 | 10:31 AM

తన పదాలను ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆయనతో ఏమైనా చెప్పించగలనని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. మోదీ నోట ఏ మాటలు వినకూడదని..

తన పదాలను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాపీ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆయనతో ఏమైనా చెప్పించగలనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. మోదీ నోట ఏ మాటలు వినకూడదని ప్రజలు కోరుకుంటారో, ఆ పని సైతం తాను చేయగలనని ఉద్ఘాటించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) రాయ్‌బరేలిలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ తీసుకోని అదానీ, అంబానీల పేర్లను సైతం మోదీ తీసుకున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి వెళ్లనివ్వకుండా..

‘‘నేను తలచుకుంటే, ప్రధాని మోదీతో ఏమైనా చెప్పించగలను. ఇటీవల నేను ‘మోదీజీ, మీరు అదానీ-అంబానీల పేర్లు ఎందుకు ఎప్పుడూ ప్రస్తావించరు’ అని ప్రశ్నించాను. దానికి సరిగ్గా రెండు రోజుల తర్వాత మోదీ నోటి వెంట అదానీ, అంబానీల పేర్లు వచ్చేశాయి. ఆ తర్వాత నేను పేదల బ్యాంకు ఖాతాల్లోకి ‘టకా-టక్ టకా-టక్’ డబ్బులు వేస్తామని చెప్పినప్పుడు.. నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ‘టకా-టక్ టకా-టక్’ అనే పదాలను వినియోగించారు’’ అని రాహుల్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘మీరు (ప్రజలను ఉద్దేశిస్తూ) ఏం కావాలనుకున్నారో అది నేను మోదీతో చెప్పించగలను. కేవలం రెండు నిమిషాల సమయమే పడుతుంది. అలాగే మోదీ నోట ఏదైనా వినదలచుకోలేదంటే, ఆ పని కూడా నేను చేసి చూపిస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు. మరి.. ఈ వ్యాఖ్యలకు బీజేపీ (BJP) ఎలా స్పందిస్తుందో చూడాలి.

చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!

ఇదిలావుండగా.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, అమేఠీ నుంచి పోటీ చేయొచ్చని మొదట్లో ఊహాగానాలు వచ్చాయి. ఈసారి ఆ స్థానంలో స్మృతి ఇరానీ, రాహుల్ మధ్య హోరాహోరీ పోరు సాగొచ్చని అంచనా వేశారు. కానీ.. కాంగ్రెస్ (Congress) ఈసారి అనూహ్యంగా ప్లాన్ మార్చేసింది. రాహుల్‌ని రాయ్‌బరేలీ స్థానం నుంచి దింపి, అమేఠీ స్థానానికి కిశోరి లాల్ శర్మను రంగంలోకి దింపింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఐదో దశలో భాగంగా మే 20వ తేదీన అమేఠీ, రాయ్‌బరేలీలో ఎన్నికలు జరగనున్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 10:31 AM

Advertising
Advertising