ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. మళ్లీ ఈ రాష్ట్రాల్లో వర్షాలు

ABN, Publish Date - Oct 11 , 2024 | 10:10 AM

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల వేళ వరణుడు పలుచోట్ల ఆటంకం కలిగించాడు. అంతేకాదు వచ్చే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

rain forecast in india

గత కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చిన వరణుడు మళ్లీ ఎటాక్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా నిన్న పలు చోట్ల చిరు జల్లులు(rains) కురిశాయి. ఈ క్రమంలోనే వచ్చే రెండు మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. ఇది ఈశాన్య అస్సాం, జమ్మూ, పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా సైక్లోనిక్ సర్క్యులేషన్ దిశగా కొనసాగుతోంది. దీని కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.


తెలుగు రాష్ట్రాల్లో

అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నెల 14 నుంచి 16 వరకు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ వానలు కురియనున్నాయి. ఇక తెలంగాణలో ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నేడు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతూ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందన్నారు.


ఈ ప్రాంతాల్లో

ఈ క్రమంలో ఈరోజు, వచ్చే 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతోపాటు ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ క్రమంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌ నుంచి రుతుపవనాలు రానున్న క్రమంలో మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి.

గత రాత్రి

దీంతో గత రాత్రి ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం మరోసారి అస్తవ్యస్తంగా కనిపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రజలు గత 10 రోజులుగా తేమ, వేడితో బాధపడుతున్నారు. అయితే ఈరోజు ఉదయం ఢిల్లీలో చల్లదనం కనిపించింది. రానున్న కొద్ది రోజుల్లో కూడా ఢిల్లీలో ఇలాంటి మిశ్రమ వాతావరణం ఉండనుందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.


ఉత్సవాలకు ఆటంకం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం రాత్రి అకస్మాత్తుగా తుఫాను, కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో థానే, ములుంద్, కుర్లా, ఘట్‌కోపర్, దాదర్, వర్లీ, అంధేరి-బాంద్రా, బోరివలిలో భారీ వర్షాలు కురిశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాలను కూడా దారి మళ్లించారు. నవరాత్రి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడింది. గర్బా ఆడేందుకు, దుర్గాపూజ చేసేందుకు బయటకు వచ్చిన ప్రజలు ట్రాఫిక్‌ జామ్‌లు, నీటి ఎద్దడిలో చిక్కుకున్నారు. ఈరోజు కూడా మహారాష్ట్రలోని 29 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి:

Police Seize: స్నాక్స్ ప్యాకెట్ల చాటున డ్రగ్స్ సరఫరా.. రూ.2,000 కోట్ల విలువైన సరుకు పట్టివేత


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి



Read More National News and Latest Telugu News

Updated Date - Oct 11 , 2024 | 10:12 AM