ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

ABN, Publish Date - May 09 , 2024 | 09:21 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.

Congress VS BJP

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారం(Election Campaign)లో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవే రిజర్వేషన్లు, రాజ్యాంగం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మెడల్లో పుస్తెల తాళ్లు సైతం ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మోదీ విమర్శించడంతో అసలు రాజకీయం మొదలైంది. అలాగే ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయబోమని, వాటిని రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేతలు బహిరంగంగా ప్రకటించారు. దీనికి ప్రతిగా మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఒబిసి రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. దీంతో ఎన్నికల ప్రచారం మొత్తం రాజ్యాంగం, రిజర్వేషన్ల కేంద్రంగా జరుగుతోంది. అసలు రిజర్వేషన్లపై రాజ్యంగం ఏమి చెబుతోంది. మతాలవారీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉందా.. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇస్తారనే విషయాలు తెలుసుకుందాం.

హిందూ జనాభా తగ్గుముఖం..


ముస్లింలకు రిజర్వేషన్లు..!

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఒబిసి రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల సభలో చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ రాత్రికి రాత్రే ముస్లింలను ఒబిసిలుగా ప్రకటించి, 27 శాతం రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చిందంటున్నారు. తాజా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ముస్లింలకు రిజర్వేషన్లకు అనుకూలమని ప్రకటించడం మరింత వివాదానికి దారితీసింది. బీజేపీ మాత్రం మత రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, మతపరంగా రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదని అంటున్నారు.


బ్రిటిషుల కాలం నుంచి..

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 20 సంవత్సరాల ముందు రిజర్వేషన్ల విధానం అమలులో ఉంది. అంటరాని కులాల విముక్తి కోసం బ్రిటీష్ వారు షెడ్యూల్డ్ కులాలు పేరుతో షెడ్యూల్‌ను రూపొందించి అమలు చేశారు. స్వాతంత్య్రానంతరం రూపొందించిన భారత రాజ్యాంగంలో కుల రిజర్వేషన్లు కల్పించి, షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగ (ఎస్సీ-ఎస్టీ)కింద ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని పొందుపర్చారు. అదే సమయంలో, ఆర్టికల్ 16 (4) వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటే ఏమిటో రాజ్యాంగంలో ప్రస్తావన లేకపోయినా.. గవర్నర్ సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని రాజ్యాంగంలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4) మరియు 15 (5) విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన తరగతులు లేదా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిబంధనలను చేర్చబడ్డాయి.

Supreme Court: విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దు.. పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీం సూచన


పదేళ్లపాటు..

ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. 10 ఏళ్లు మాత్రమే అమలు చేయాలని, ఆ తర్వాత సామాజిక పరిస్థితులను సమీక్షించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయితే ఏ ప్రభుత్వమూ దీనిని సమీక్షించలేదు. కానీ రిజర్వేషన్ల శాతం పెరుగుతూ వస్తున్నాయి. గరిష్టంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నిబంధన ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.


మండల్ కమిషన్ నివేదిక తర్వాత..

1980లో మండల్ కమిషన్ నివేదిక తర్వాత రిజర్వేషన్ కోటాను 49.5 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఈ సిఫార్సులను పట్టించుకోలేదు. ఆ తరువాత వీపీ సింగ్ ప్రభుత్వం 1990 సంవత్సరంలో మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. 3,743 కులాలను ఓబీసీలో చేర్చి 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ-ఎస్టీలకు ఇప్పటికే 22.5 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఈ విధంగా రిజర్వేషన్లు 49.5 శాతానికి చేరాయి. మండల్ కమిషన్ స్వయంగా ముస్లిం సమాజంలోని కొన్ని కులాలను OBCలో చేర్చాలని సిఫార్సు చేసింది. దీంతో ముస్లింలలో కొంతమందిని ఓబీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1992లో ఒబిసి రిజర్వేషన్లు సమర్థించబడ్డాయి. దీంతో ఈ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమలులోకి వచ్చాయి. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని రాజ్యాంగ సభలో ప్రస్తావించినప్పటికీ.. దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. కానీ అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు కలిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై..

మత ప్రాతిపదికన రిజర్వేషన్ విషయానికొస్తే.. రాజ్యాంగంలో దీని గురించి ఎలాంటి నిబంధన పెట్టలేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మైనార్టీ, వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో వేర్వేరుగా హక్కులు కల్పించబడ్డాయి. ఏ మతానికి చెందిన వారైనా దాని పరిధిలోకి వస్తే, వారు మైనార్టీ లేదా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం, కేవలం మతం ఆధారంగా ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.


రాజ్యాంగం ప్రకారమే అంటూ..

మతం పేరుమీద రిజర్వేషన్లను రాజ్యాంగం అనమతించదని, భారత రాజ్యాంగం ప్రకారమే తాము నడుచుకుంటామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని, మతం ప్రాతిపదికన కాకుండా ముస్లింలలో వెనుకబడిన వారికే రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు, రాజ్యాంగం అంశాలు ప్రచార అస్త్రాలుగా మారాయి. ఓటర్లు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది జూన్4న తేలనుంది.


Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest News and National News click here..

Updated Date - May 09 , 2024 | 09:31 AM

Advertising
Advertising