National news: లక్ష కిలోల బంగారం తరలింపు.. ఎక్కడికంటే..?
ABN , Publish Date - May 31 , 2024 | 06:28 PM
ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మెుదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు.
ముంబయి: ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారాన్ని(Gold) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(Bank of England)లో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మెుదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు.
పెరిగిన ఆర్బీఐ బంగారం నిల్వలు..
కొన్నేళ్లుగా ఆర్బీఐ బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తూ వచ్చింది. ముంబయి మింట్ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో ఆర్‌బీఐ బంగారాన్ని నిల్వ చేస్తుంటుంది. దీంతో 2024మార్చి నాటికి ఆర్‌బీఐ వద్ద 822.1టన్నుల పసిడి నిల్వలు చేరాయి. దీంట్లో దాదాపు సగం అంటే 413.8టన్నులు విదేశాల్లోనే నిల్వ చేసింది. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో తనఖా పెట్టిన 100టన్నుల పసిడిని దేశానికి రప్పించింది. ఆర్థిక సంక్షోభం కుదుటపడిన తర్వాత ఆర్బీఐ బంగారాన్ని కొంటూ పోవడంతో విదేశాల్లో నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంట్లో కొంత మొత్తాన్ని భారత్‌కు తరలించారు.
పసిడి స్వదేశానికి వచ్చిందిలా..
ఈ స్థాయిలో విదేశాల నుంచి బంగారాన్ని తరలించడం ఆషామాషి విషయం కాదు. దీనిపై ఆర్బీఐ ఎన్నో నెలలు కసరత్తు చేసింది. రవాణా, భద్రతాపరమైన అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని నెలలపాటు సంసిద్ధం అయ్యింది. ఆర్థికశాఖ సహా ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం మధ్య సమన్వయం ఉండేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. పటిష్ఠ భద్రత మధ్య ప్రత్యేక విమానంలో దేశానికి తీసుకువచ్చింది. ముందుగా ఆర్థికశాఖ నుంచి ఆర్‌బీఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు పొందింది. అన్నీ దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం ఆర్బీఐ కట్టక తప్పలేదు. తనఖా పెట్టిన బంగారాన్ని ఈ స్థాయిలో స్వదేశానికి తీసుకురావడంతో ఆర్‌బీఐకి నిర్వహణ వ్యయాలు తగ్గనున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో బంగారం నిల్వ చేసినందుకు చెల్లిస్తున్న రుసుము ఇకపై చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
National news: సీఎం, డిప్యూటీ సీఎంకు చేతబడి.. ఏ రాష్ట్రంలో అంటే..?
Telangana: తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?
Lok sabha Elections: ఆ రాష్ట్రాల్లో లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు..
For Latest News and National News click here..