Delhi: దారుణం.. ఏడు నెలల గర్భవతిని హత్య చేసిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:53 AM
ఢిల్లీ నగరం నాంగ్లోయ్ ప్రాంతంలో సోనీ(19) కుటుంబసభ్యులతో కలిసి నివసించేది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. సోనీకి సోషల్ మీడియాలో దాదాపు 6 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
న్యూఢిల్లీ: ఏడు నెలల గర్భవతిని ప్రియుడు అతని స్నేహితులు హతమార్చిన ఘటన దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమిస్తున్నానని నమ్మించాడు, పెళ్లి చేసుకుందామని ఆశ పెట్టాడు. శారీరంగా వాడుకుని చివరికి మెుఖం చాటేశాడు. ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేసుకోవాలని ప్రశ్నించిన ఆమెను దారుణంగా హత్య చేశాడు. కామవాంఛలు తీర్చుకుని యువతిని ఘోరంగా మోసం చేశాడు. అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపులకు దిగాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ప్రాణాలు తీశాడు.
ఢిల్లీ నగరం నాంగ్లోయ్ ప్రాంతంలో సోనీ(19) కుటుంబసభ్యులతో కలిసి నివసించేది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. సోనీకి సోషల్ మీడియాలో దాదాపు 6 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమెకి కొన్నేళ్ల క్రితం సంజు అకా సలీమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. వారిద్దరూ వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసేవారు. అయితే సోనీ తల్లిదండ్రులు సలీమ్ గురించి ప్రశ్నించగా తన స్నేహితుడంటూ బదులిచ్చేది. సలీమ్ కూడా తాము కలిసిన ఫొటోలు, ఇద్దరి గురించిన సమాచారాన్ని తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పంచుకునేవాడు.
సలీమ్, సోనీ ప్రేమ కాస్త ముదిరి ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని, తనను వదిలి ఉండలేనని చెప్పింది. అయితే సలీమ్ మాత్రం అందుకు నిరాకరించాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకోనని అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడు. అందుకు యువతి నిరాకరించింది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల కాగా, ఇంట్లో విషయం తెలిసిపోయింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పలుమార్లు అతడిని నిలదీసింది. ఇదే విషయమై వారి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. అయితే ప్రియుడు సలీమ్ మాత్రం సోనీని అడ్డు తప్పించాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పాడు. ముగ్గురూ కలిసి సోనీని హత్య చేసేందుకు పథకం రచించారు.
యువతికి మాయమాటలు చెప్పిన సలీమ్ గత సోమవారం నాడు ఆమెను హర్యానా రాష్ట్రం రోహ్తక్కు తీసుకెళ్లారు. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా ముగ్గురూ కలిసి ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టారు. అయితే కుమార్తె సమాచారం తెలియని తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. సోనీ ప్రియుడు సలీమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సలీమ్‌ను అరెస్టు చేసి తమ స్టైల్లో విచారణ చేశారు. దీంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సలీమ్‌తోపాటు అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతనిడీ త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటన ఢిల్లీ నగరాన్ని కుదిపేస్తోంది.
Updated Date - Oct 26 , 2024 | 11:53 AM