ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LS Polls 2024: రాహుల్‌కు షాక్.. వయనాడ్‌కు స్మృతి ఇరానీ..

ABN, Publish Date - Apr 04 , 2024 | 12:11 PM

రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్‌ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.

రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్‌ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు.

Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?

రెండోదశలో పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో వయనాడ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన 24 గంటల తర్వాత బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సీపీఐ అభ్యర్థిగా డి. రాజా భార్య అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు ప్రతిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ అవుతారు. వయనాడ్ నుంచి సురేంద్రన్‌ను పార్టీ అభ్యర్థిని చేసింది.

బీజేపీ అభ్యర్థి నామినేషన్

కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన భారీ రోడ్ షో‌లో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఇప్పటికే రాహుల్‌ను టార్గెట్ చేశారు స్మృతి ఇరానీ. గాంధీ కుటుంబం 50 ఏళ్లు పాలించిన ప్రాంతం నుంచి వచ్చానన్నారు. పీఎఫ్‌ఐ వంటి నిషేధిత సంస్థల నుంచి రాహుల్ గాంధీ సహాయం తీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అమేథీ అభివృద్ధిని రాహుల్ గాంధీ పట్టించుకోలేదని ఆరోపించారు. వయనాడ్ అభివృద్ధికి రాహుల్ ఏం చేయలేదని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే

Updated Date - Apr 04 , 2024 | 12:11 PM

Advertising
Advertising