ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Monsoon Season: హమయ్యా.. కేరళ తీరాన్ని తాకిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు అప్పుడే

ABN, Publish Date - May 30 , 2024 | 12:01 PM

ఏటా ఆలస్యంగా పలకరించే నైరుతి రుతుపవనాలు(Monsoon Season).. ఈ ఏడాది త్వరగా వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పలకరించే రుతుపవనాలు.. గురువారం కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తిరువనంతపురం: ఏటా ఆలస్యంగా పలకరించే నైరుతి రుతుపవనాలు(Monsoon Season).. ఈ ఏడాది త్వరగా వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పలకరించే రుతుపవనాలు.. గురువారం కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. వీటి రాకతో రానున్న 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన తేదీ(మే 31) కంటే ఒక రోజు ముందుగానే రుతుపవనాలు రావడం విశేషం. రానున్న 5 రోజులపాటు కేరళలో భారీ వర్షాలు పడనున్నాయి. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.


ఏపీ, తెలంగాణకు అప్పుడే..

నాలుగు రోజుల్లో ఏపీకి నైరుతి విస్తరిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈసారి ఏపీలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంటున్నారు. తెలంగాణలో కూడా కూడా వారంలోగా రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

జూన్ మొదటి వారంలో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాలలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జూన్ చివరి వారం నాటికి రెండు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇది నిజంగా చల్లటికబురే.

దేశవ్యాప్తంగా..

దేశంలోని చాలా రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నిప్పుల వర్షం కురుస్తోన్నట్లుగా పరిస్థితి ఉంది. భానుడి భగభగలకు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

For Latest News and National News click here..

Updated Date - May 30 , 2024 | 01:32 PM

Advertising
Advertising