Share News

State Govt: కేంద్రమంత్రి క్షమాపణలు చెబితే ఓకే..

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:24 PM

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనతో తమిళులకు సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) మీడియా ఎదుట బహిరంగ క్షమాపణ చెబితే మన్నిస్తామని రాష్ట్రప్రభుత్వం(State Govt) హైకోర్టుకు స్పష్టం చేసింది.

State Govt: కేంద్రమంత్రి క్షమాపణలు చెబితే ఓకే..

- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

చెన్నై: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనతో తమిళులకు సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) మీడియా ఎదుట బహిరంగ క్షమాపణ చెబితే మన్నిస్తామని రాష్ట్రప్రభుత్వం(State Govt) హైకోర్టుకు స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన కేంద్ర సహాయ మంత్రి శోభా కరందలజే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు దాడి ఘటనకు తమిళులే కారణమని వ్యాఖ్యానించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఆ తరువాత కేంద్రమంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు.

ఇదికూడా చదవండి: Tungabhadra water: తీరనున్న ప్రజల ‘పానీ’ పాట్లు..


కేసు నమోదు..

తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి శోభపై చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు డీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharti) ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రి విద్వేష పూరిత వ్యాఖ్యలకు సంబంధించి డీఎంకే చేసి ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది.

nani1.3.jpg


ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం, కేంద్ర సహాయ మంత్రి శోభపై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మతసామరస్యానికి విఘాతం కల్పించేలా మాట్లాడారంటూ ఎన్నికల కమిషన్‌ ప్రజా ప్రతినిధుల చట్టం 3 విభాగం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి శోభ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు.


nani1.2.jpg

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జయచంద్రన్‌ బుధవారం విచారణ జరిపారు. ఆ సమయంలో, శోభా కరందలజే మీడియా సమావేశంలో క్షమాపణలు చెబితే అంగీకరిస్తామని రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. అయితే విలేఖరుల సమావేశంలో కాకుండా, ప్రమాణ పత్ర రూపంలో క్షమాపణ చెబుతామని శోభ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు.

తమిళుల పేరును మీడియా సమావేశంలో ఉచ్ఛరించినందున, క్షమాపణలు కూడా వారి ముందే చెబితే బావుంటుందని అభిప్రాయపడిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2024 | 12:24 PM