Supreme Court: శంభు సరిహద్దుల్లో దశలవారిగా బారికేడ్ల తొలగింపునకు సుప్రీం ఆదేశం
ABN, Publish Date - Jul 24 , 2024 | 03:41 PM
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు (Farmers) గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు (Shambhu) సరిహద్దుల్లో యథాతథ స్థితిని (Status quo) కొనసాగించాలని సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతులు, ఇతర భాగస్వాముల మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు స్వతంత్ర కమిటీ (Independent committee)ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదన చేసింది. ప్రముఖ వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని, రైతుల న్యాయపరమైన డిమాండ్లపై ఆచరణకు సాధ్యమైన పరిష్కారం కనుగొనే బాధ్యతను కమిటీకి అప్పగించాలని సూచించింది.
కమిటీలోకి తీసుకునే ప్రముఖుల పేర్లను వారంలోగా తమకు సమర్పించాలని, తగిన సూచనలు ఇవ్వడంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు విఫలమైతే కమిటీకి తగిన పేర్లను సూచించే బాధ్యత తామే తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Rahul Gandhi: రైతు ప్రతినిధులతో రాహుల్ .. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు తెచ్చే యోచన
అంబాలా-న్యూఢిల్లీ హైవేపై బారికేడ్లు
పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు (MSP) చట్టపరమైన హామీ ఇవ్వాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు కొద్దకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి మార్చ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీంతో అంబాలా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై హర్యానా ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేసింది.
జూలై 12న తీర్పులో సుప్రీం ఏంచెప్పిందంటే..?
సరిహద్దుల్లో బారికేడ్లపై హర్యానా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జూలై 12న నిలదీసింది. బారికేడ్లు తొలగించాలని ఆదేశించింది. ఏ అథారిటీతో హైవేను దిగ్బంధిస్తారని ప్రశ్నించింది. ''హైవేను ఒక రాష్ట్రం ఎలా బ్లాక్ చేస్తుంది? రెగ్యులర్ ట్రాఫిక్‌ను నియంత్రించడమే వారి డ్యూటీ. బారికేడ్లను తొలగించండి, అయితే రెగ్యులేట్ చేయండి'' అని హర్యానా తరఫు హాజరైన లాయర్‌ను ఆదేశించింది. రైతు ఆందోళనకారులకు, హర్యానా భద్రతా సిబ్బందికి మధ్య గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మాజీ హైకోర్టు జడ్జి సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దానిపై విచారణ సందర్భంగా బారికేడ్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని నిలదీస్తూ, వాటిని తొలగించాలని ఆదేశించింది.
Read Latest Telangana News and National News
Updated Date - Jul 24 , 2024 | 03:41 PM