Share News

Bail Extension Plea: కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 28 , 2024 | 02:11 PM

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్‌ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకొన్నఅత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

Bail Extension Plea: కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్‌ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకొన్నఅత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పిటిషన్‌పై తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Dera Baba: ఆ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు

మద్యం కుంభకోణం కేసులో మని లాండరింగ్ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మే 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తీహాడ్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించు కోవాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మే 10వ తేదీ కేజ్రీవాల్‌కు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..


Indigo Flight: ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఆ క్రమంలో జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. దీంతో తనకు మరో వారం రోజుల బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పై విధంగా స్పందించింది.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 02:17 PM