ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : ఏం ధరించాలో ఎలా చెబుతారు?

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:43 AM

కళాశాలకు వచ్చే విద్యార్థులు ‘హిజాబ్‌, బుర్ఖా, నఖాబ్‌, టోపీ’ వంటివి ధరించవద్దంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్టం చేసింది.

  • హిజాబ్‌పైనే నిషేధమా? బొట్టు, తిలకంకు కూడా వర్తిస్తుందా?

  • ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థినుల్ని సాధికారికతవైపు ఎలా తీసుకెళ్తారు?

  • హిజాబ్‌పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు.. స్టే

  • పేర్ల ద్వారా మతం వెల్లడవటం లేదా?

  • హిజాబ్‌, బుర్ఖాలపై నిషేధం విధించిన

  • ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కళాశాలకు వచ్చే విద్యార్థులు ‘హిజాబ్‌, బుర్ఖా, నఖాబ్‌, టోపీ’ వంటివి ధరించవద్దంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం బొట్టు, తిలకంలకు కూడా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది.

‘ఏం ధరించాలో నిర్దేశించటం ద్వారా మహిళలను, విద్యార్థినులను ఏ విధంగా మీరు సాధికారితవైపు తీసుకెళ్తారు’ అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సదరు కళాశాల ‘ఎన్‌జీ ఆచార్య, డీకే మరాథే కాలేజీ’ తరఫు న్యాయవాది మాధవి దివాన్‌ వాదనలు వినిపిస్తూ, తమది కో-ఎడ్యుకేషన్‌ కాలేజీ అని, విద్యార్థులు ఏయే మతాలకు చెందినవారో వెల్లడి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పందిస్తూ.. ‘అలా అనుకుంటే విద్యార్థుల పేర్ల ద్వారానే వారు ఏ మతానికి చెందిన వారో తెలుస్తుంది కదా? ఇటువంటి నిర్ణయాలను వారిపై రుద్దకండి’ అని పేర్కొన్నారు. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ కూడా దీనిపై స్పందిస్తూ.. ‘స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశంలో పలు మతాలు ఉన్నాయని ఇప్పుడు మీరు గుర్తించటం దురదృష్టకరం. విద్యార్థినులు హిజాబ్‌ మొదలైన వాటిని ధరిస్తున్న విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీరు నిద్రలోంచి లేచినట్లుగా గుర్తించారు’ అని పేర్కొన్నారు. కాలేజీ క్యాంప్‌సలో ఎవరూ హిజాబ్‌, టోపీ, బ్యాడ్జీలు ధరించవద్దంటూ జారీ చేసిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.


కొందరు కాలేజీకి రావటం మానేశారు!

పిటిషన్లు దాఖలు చేసిన విద్యార్థినుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు కొలిన్‌ గోంజాల్వెజ్‌, అబిహ జైదీ.. హిజాబ్‌పై నిషేధం వల్ల కొందరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లటం మానుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ తరఫు లాయర్‌ వాదిస్తూ, కాలేజీకి వచ్చిన తర్వాత హిజాబ్‌, బుర్ఖాలను తీసి భద్రపర్చుకోవటానికి లాకర్‌ సదుపాయం కల్పించామని, కాలేజీలో ఉన్న 441 మంది ముస్లిం విద్యార్థినుల్లో పిటిషన్‌ వేసిన ముగ్గురికి తప్ప ఇతరులెవరికీ అభ్యంతరం లేదన్నారు.

విస్తృత ధర్మాసనం విచారణ?

కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం.. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయటం, దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై 2022 అక్టోబరు 13న సుప్రీంకోర్టు ధ్విసభ్య ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా, మరో న్యాయమూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఈ అంశంపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశం పెండింగ్‌లో ఉంది.

Updated Date - Aug 10 , 2024 | 05:43 AM

Advertising
Advertising
<