BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?
ABN, Publish Date - Jun 08 , 2024 | 04:48 AM
దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.
పరిశీలనలో బండి, ఈటల, కిషన్‌రెడ్డి, డీకే పేర్లు
న్యూఢిల్లీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది. అందుకే తెలంగాణకు కీలకమైన మంత్రి పదవులు దక్కుతాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆశిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే, మూడు నుంచి నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలిసింది. అయితే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణకు రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీని పల్లెపల్లెకు పరిచయం చేసిన వ్యక్తి బండి సంజయ్ అనే ప్రచారం ఉంది. దీంతో ఆయనకు క్యాబినెట్‌లో స్థానం దక్కుతుందన్న సంకేతాలు అందుతున్నట్టు చెబుతున్నారు.
అయితే ఆయన పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు గెలవగా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈసారి కూడా తనకే మంత్రి పదవి వస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించారు డీకే అరుణ.
ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. దక్షిణాది నుంచి మహిళా కోటా కింద ఆమెకు మంత్రి పదవి వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎ్‌సను ఎదుర్కోవడంలో ఈటల రాజేందర్ తనదైన పాత్ర పోషించారు. అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
Updated Date - Jun 08 , 2024 | 06:49 AM