Congress: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వాటిపైనే ప్రధాన దృష్టి..
ABN, Publish Date - Apr 05 , 2024 | 10:01 AM
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) మేనిఫెస్టోను విడుదల చేయనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీలు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ ఎజెండాలో ముఖ్యంగా 5 న్యాయ్ లకు సంబంధించి 25 హామీలపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, రైతులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలు ఉంటాయని సమాచారం.
Navneeth Kaur: నా పుట్టుక గురించి ప్రశ్నించిన వారికి సమాధానం లభించింది.. ఎంపీ నవనీత్..
కుల గణన, ఓపీఎస్ హామీ, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన, మహిళలకు నెలకు రూ.6 వేలు, అగ్నివీర్ పథకం నిలిపివేత, రైతులకు మద్దతు ధర, రూ.450కి గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపు, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా వంటి అనేక అంశాలు పార్టీ మేనిఫెస్టోలో ఉండనున్నాయి. మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల్లో గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చలు జరపనున్నారు.
మరోవైపు.. మేనిఫెస్టో విడుదలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈశాన్య దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కుటుంబాలకు హామీ కార్డులు పంపిణీ చేయనున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 05 , 2024 | 10:02 AM