ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే..

ABN, Publish Date - Apr 03 , 2024 | 05:31 PM

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రేపు ( గురువారం ) తీర్పు వెలువడే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. రాబోయే ఎన్నికల్లో మొదటి ఓటు వేయకముందే ఆప్ పార్టీని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వీ మాట్లాడుతూ ఇది చాలా ముఖ్యమైన కేసు అని కోర్టుకు తెలిపారు. అరెస్టు కారణంగా ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.


Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

ఈడీ తరఫున ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు చెప్పారు. లిక్కర్ కేసులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాన్ని గుర్తించామని హవాలా ద్వారా వందకోట్ల రూపాయలు ఆప్ పార్టీకి అందాయని చెప్పారు. వాటిని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని, ఆప్ మీడియా ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ లిక్కర్ కేసులో కీలకపాత్ర వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


Supreme Court: తగినంత సమయం ఇస్తాం.. అందరి వాదనలు వింటాం.. సుప్రీంకోర్టు..

కాగా.. ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలుకు తరలించారు. ఘటనపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ఆయనను జైల్లో పెట్టారని ఆరోపించారు. ఈ నియంతృత్వ పాలనకు దేశ ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే బీజేపీ, ఈడీల లక్ష్యమనే విషయం అర్థమైందని ఫైర్ అయ్యారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 05:40 PM

Advertising
Advertising