ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: డిపాజిట్ కట్టేందుకు రూ.10 నాణేలు.. లెక్కపెట్టలేక తలపట్టుకున్న అధికారులు..

ABN, Publish Date - Mar 21 , 2024 | 11:58 AM

మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మొదటి విడతలో ఎన్నికలు ( Elections ) జరిగే ప్రాంతాల్లో నామినేషన్‌ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిపాజిట్ కట్టి తమ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ చేయించుకుంటున్నారు.

మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మొదటి విడతలో ఎన్నికలు ( Elections ) జరిగే ప్రాంతాల్లో నామినేషన్‌ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిపాజిట్ కట్టి తమ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో జబల్‌పూర్‌కు చెందిన ఓ యువ స్వతంత్ర అభ్యర్థి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వినయ్ చక్రవర్తి అనే వ్యక్తి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వచ్చారు. నామినేషన్ కు రూ.25,000 డిపాజిట్ చేయాల్సి రావడంతో తాను ఆన్ లైన్ విధానంలో డబ్బు చెల్లిస్తానని చెప్పారు. అయితే ఆన్ లైన్ విధానంలో చెల్లించేందుకు నిబంధనలు లేవని, నగదు రూపంలోనే చెల్లించాలని అధికారులు చెప్పడంతో వినయ్ విస్తుపోయారు.

వినయ్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పారు. వారు తాము ఉన్నామని, ఆందోళన చెందవద్దని చెప్పి తమకు తెలిసిన దుకాణదారుల వద్ద నుంచి చిల్లర సేకరించారు. అన్నీ పది రూపాయల నాణేలతో 25 వేలు సమకూర్చి నామినేషన్ దాఖలు చేశారు. డిపాజిట్ చేసేందుకు నాణేలు తీసుకురావడంతో అధికారులు అవాక్కయ్యారు. వాటిని లెక్కించేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది.

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం


దీనిపై స్పందించిన జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ సక్సేనా నిబంధనల ముసుగులో కొందరు అధికారులను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. డబ్బు ఏ కరెన్సీలో ఇస్తున్నారనేది ముఖ్యం కాదన్న ఆయన డబ్బును నగదు రూపంలోనే తీసుకోవాలని అని అన్నారు. పాలనాపరమైన వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా..ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని వినయ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 11:58 AM

Advertising
Advertising