ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: మొగ్గు మాకంటే మాకు..

ABN, Publish Date - May 12 , 2024 | 03:21 AM

దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్‌ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.

  • ఎన్డీఏకు మెజారిటీ రాదంటున్న ఇండియా.. 350 సీట్లు ఖాయమంటున్న బీజేపీ శిబిరం

న్యూఢిల్లీ, మే 11(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్‌ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి. ‘దేశంలో ఇండియా కూటమి సునామీ వీస్తోంది. బీజేపీకి మెజారిటీ సీట్లు లభించే అవకాశం లేదు’ అని యూపీలో రాహుల్‌గాంధీ నొక్కి చెప్పారు. కాషాయ పార్టీకి గతం కంటే కనీసం వంద సీట్లు తగ్గుతాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. అయితే, ‘‘కాంగ్రెస్‌ 50 సీట్లు కూడా నెగ్గదు. ఎన్డీఏ అన్ని రికార్డులు అధిగమించి 400 పైగా స్థానాలు సాధిస్తుంది’’ అని ప్రధాని మోదీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి అంచనా సరైనదవుతుంది? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోంది. 543 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటికి 3 దశల్లో 283 సీట్లకు ఓటింగ్‌ పూర్తయింది. సోమవారం 96 చోట్ల ఎన్నికలున్నాయి.


మోదీ మాట మారింది.. అదే నిదర్శనం

ఇండియా కూటమిలో ఏ నేతను కదిలించినా బీజేపీకి మెజారిటీ సీట్లు రావని చెబుతున్నారు. మూడు దశల పోలింగ్‌ను బట్టి ఇది స్పష్టమైందని, అభివృద్ధి, రామ మందిరం ఎన్నికల ప్రధానాంశాలుగా భావించిన ప్రధాని మోదీ.. ఓటమి భయంతో హిందూ-ముస్లిం, ఇతర అప్రధాన అంశాలను లేవనెత్తి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. యూపీలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఎన్డీఏకు సీట్లు తగ్గుతాయని వివరిస్తున్నారు. బిహార్‌లో బీజేపీతో చేతులు కలిపిన నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయూ, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే శివసేన, అజిత్‌పవార్‌ ఎన్సీపీని ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొంటున్నారు. ఇక ప్రజ్వల్‌ రాసలీలల వీడియోలు బయటపడిన తర్వాత కర్ణాటకలో బీజేపీ-జనతాదళ్‌(ఎస్‌) గ్రాఫ్‌ పడిపోయిందని విశ్లేషిస్తున్నారు.


యూపీని స్వీప్‌ చేస్తాం..!

విపక్ష కూటమి వాదనను బీజేపీ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు. రామ మందిర నిర్మాణంతో యూపీలో మోదీ ప్రభంజనం వీస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్న రీత్యా 75 సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి పాతిక సీట్ల దాక వచ్చినా రావొచ్చని విశ్లేషిస్తున్నారు. సందేశ్‌ఖాలీ ఉదంతంతో రాష్ట్రంలో హిందూత్వ ప్రభంజనం వీస్తోందని, సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఒకటో, రెండో సీట్లు తగ్గినప్పటికీ.. ఒడిశా, తెలంగాణ, ఏపీ, తమిళనాడులో పెరుగుతాయని వివరిస్తున్నారు.


తగ్గడం కాదు.. బలపడుతున్నాం

ఇప్పటికే అత్యధిక స్థానాలు సాధించిన రాష్ట్రాల సంగతి పక్కపెడితే.. కొత్తచోట్ల తాము బలపడనున్నామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాండ్యన్‌ నియంత్రించడంపై వ్యతిరేకత వస్తోందని, ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈ రాష్ట్రంలో గతంలోని 9 సీట్లు 14కు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 6 నుంచి 8, ఏపీలో 3 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఈ లెక్కన ప్రముఖ ఆర్థికవేత్త సుర్జీత్‌భల్లా అంచనా వేసినట్లు 350 సీట్లు వచ్చే అవకాశాలూ లేకపోలేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.


ఎన్డీఏకు దెబ్బ పడేది ఇక్కడే..

ఇండియా కూటమి నేతల లెక్కల ప్రకారం.. ప్రత్యర్థి కూటమికి యూపీలో 10, మహారాష్ట్రలో 20, బిహార్‌ లో 20, రాజస్థాన్‌లో 10, కర్ణాటకలో 15, హరియాణాలో 5, పంజాబ్‌లో 4, ఢిల్లీలో 4, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 5, గుజరాత్‌లో 2, ఛత్తీ్‌సగఢ్‌లో 2, ఈశాన్య రాష్ట్రాల్లో 10 సీట్లు (మొత్తం 111) తగ్గుతాయి. యూపీలో బీసీలు, మైనారిటీలు ఎస్పీ- కాంగ్రెస్‌ వైపు సంఘటితం అవుతున్నారని చెబుతున్నారు. హరియాణ, పంజాబ్‌, గుజరాత్‌, ఢిల్లీ తదితరచోట ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ 2 నుంచి 5 సీట్లు కోల్పోతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 03:21 AM

Advertising
Advertising