ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TMC: సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేస్తారా..? లేదా..? కునాల్ ఘోష్ బెదిరింపు

ABN, Publish Date - Mar 02 , 2024 | 01:49 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్‌‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని (Sudip Banerjee) అరెస్ట్ చేయాలని ఆ పార్టీకి చెందిన నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్‌‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో సుదీప్‌కు పెద్ద మొత్తంలో నగదు అందిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం నాడు కునాల్ ఘోష్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: BJP: ‘దీదీ’ పార్టీలో గందరగోళం..? అందుకే ప్రధాని మోదీతో స్టేజీ షేర్, బీజేపీ విమర్శలు

సుదీప్ బెనర్జీ బ్యాంక్ ఖాతా, అపోలో భువనేశ్వర్ పేరుతో జమ అయిన నగదు వివరాలపై కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందేనని కునాల్ ఘోష్ తేల్చి చెప్పారు. సుదీప్ కస్టడీలో ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో నగదు చెల్లించారని వివరించారు. సుదీప్ పేరుతో భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి నగదు చెల్లించిన అంశంపై దర్యాప్తు చేయాలని కోరారు. సుదీప్‌ను వెంటనే పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకోవాలని కోరారు. లేదంటే తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

విసిగి వేసారి.. రాజీనామా

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కునాల్ ఘోష్ విసిగిపోయారు. ‘టీఎంసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. తప్పు జరుగుతున్న వ్యవస్థలో తాను ఉండలేను. అందుకే పదవులకు రాజీనామా చేశా. టీఎంసీ సైనికుడిగా మాత్రం కొనసాగుతా, పార్టీ కోసం పనిచేస్తా. మరో పార్టీలో చేరుతున్నాననే ఊహాగానాలను తెరదించండి అని’ కునాల్ ఘోష్ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:49 PM

Advertising
Advertising