ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra: ‘శత’ వేగంగా.. తుంగభద్ర.. సాయంత్రానికల్లా...

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:27 PM

తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్‌ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది.

- వంద టీఎంసీలకు చేరువలో తుంగభత్ర డ్యాం..

- ఎగువ వర్షాలతో పోటెత్తుతున్న వరద

- నేడు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం

- ఆయకట్టు రైతుల్లో హర్షం

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్‌ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది. సోమవారం సాయంత్రానికి 99 టీఎంసీల నీరు చేరింది. మంగళవారానికి 100 టీఎంసీలు కావచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 10న ప్రమాదంతో క్రస్ట్‌ గేటు విరిగిపోయి నీరు వృథాగా పోతుండంతో మూడు రాష్ట్రాల రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇదికూడా చదవండి: Trains: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. పలు రైళ్ల రద్దు


సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు ఈ ఏడు కూడా కష్టాలు తప్పవని ఆందోళన చెందారు. డ్యాం ఖాళీ అయితే తమ పరిస్థితి ఏమిటని బాధ పడ్డారు. క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో కార్మికులు శ్రమించి మరమ్మతులు చేపట్టడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. క్రస్ట్‌ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌(Stoplog) అమర్చి డ్యాంలో నీరు నిల్వకు కృషి చేశారు. ఆగస్టు 13న ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తుంగభద్ర డ్యాంను పరిశీలించారు.


నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ జలాశయం మళ్లీ నిండుతుంది.. తానే వచ్చి వాయనం ఇస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. వరుణుడు కరుణించి జోరుగా వర్షాలు కురిపిస్తుండంతో తుంగభద్ర మళ్లీ జలకళ సంతరించుకుంది. డ్యాం అధికారులు సోమవారం ఉదయం ప్రకటించిన నీటి లెక్కల ప్రకారం నీరు 98.961 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 33,789 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో వివిధ కాలవలతో పాటు నదికి విడుదల చేస్తున్న నీరు 15,400 క్యూసెక్కులుగా ఉంది.

గత పదేళ్ల నాటి నీటి లభ్యతను పరిశీలిస్తే ప్రస్తుత ఏడాది మెరుగ్గా ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. తుంగభద్ర డ్యాంలో నిండుకుండలా నీరు ఉండడం, కాలవలకు నీరు పుష్కలంగా వస్తుండంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2024 | 12:27 PM

Advertising
Advertising