ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi : నేడే నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం

ABN, Publish Date - Jun 09 , 2024 | 04:02 AM

మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని ..

  • ఢిల్లీలో హైఅలర్ట్‌.. డ్రోన్‌ సంచారం నిషిద్ధం

  • నేటి ప్రమాణస్వీకార వేదిక రాష్ట్రపతి భవన్‌

  • పరిసరాలు ఎన్‌ఎస్‌జీ ఆధీనంలోకి

  • ‘జీ-20’ తర్వాత మళ్లీ ఆ స్థాయి ఉక్కురక్షణ

  • ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాధినేతలు

  • ఢిల్లీలో హైఅలర్ట్‌.. డ్రోన్‌ సంచారం నిషిద్ధం..

  • నేటి ప్రమాణస్వీకార వేదిక రాష్ట్రపతి భవన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 8 : మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్పటికే భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు, షార్ప్‌ షూటర్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

ప్రమాణ స్వీకార మహోత్సవానికి దక్షిణాసియా దేశాల అధినేతలు వస్తుండటం, అధికార ఎన్డీయే పార్టీల అధినాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లడంతో, ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రపంచ దేశాల అధినేతలు గత ఏడాది పాల్గొన్న జీ-20 సదస్సుకు కల్పించిన భద్రతను తలపించేలా ఏర్పాట్లు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ప్రపంచాధినేతలు ఢిల్లీలో బస చేసిన హోటళ్ల దగ్గర, వారు పాల్గొనాల్సిన సదస్సు ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అప్పట్లో అణువణువున ప్రత్యక భద్రతా బృందాలు జల్లెడ పట్టాయి. చిన్న పొరపాటుకూ తావు ఇవ్వకుండా డేగకళ్ల పహారా కొనసాగించాయి. మళ్లీ.. ఇప్పుడు అదే వాతావరణం దేశ రాజధానిలో కనిపిస్తోంది. ఢిల్లీ హై ఓల్టేజీ స్థితికి చేరుకుంది.


ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే ప్రముఖులు బస చేసిన హోటళ్లు, రిసార్టులు, ప్రభుత్వ అతిథి గృహాల వద్ద పెద్దఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. మూడు అంచెల భద్రతా వలయాన్ని రాష్ట్రపతి భవన్‌ వద్ద, పరిసరాల్లో నిర్మించారు. మొదటి అంచెలో ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, రెండో అంచెలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు, డ్రోన్లు, ఆ తర్వాతి అంచెలో స్నీపరు బృందాలు (స్వాట్‌- స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌) ఉన్నాయి.

రాష్ట్రపతి భవన్‌ బయటి పరిసరాలు పూర్తిగా ఎన్‌ఎ్‌సజీ, స్వాట్‌ బృందాల అదుపులో ఉన్నాయి. ప్రముఖులు తాము బస చేసిన హోటళ్లనుంచి ఏ మార్గంలో రాష్ట్రపతిభవన్‌కు వెళ్లాలి.. తిరిగి వారి బసకు ఎలా చేరుకోవాలనేదానిపై నిర్దిష్ట రూట్‌మ్యా్‌పను తయారుచేశారు. ఈ రూట్లను స్నీపర్లు, సాయుధ బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 2500 మంది పోలీసులను ఈ పనులకు నియమించారు. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహారా కొనసాగుతోంది. అతిథులుగా ఆహ్వానించిన ఇరుగుపొరుగు (పాకిస్థాన్‌ను మినహాయించి) దేశాల అధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లీలా, తాజ్‌, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్‌, ఒబేరాయ్‌ తదితర ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను వారికోసం బుక్‌ చేశారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 05:05 AM

Advertising
Advertising