ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wife and Husband: భర్త తల పగలగొట్టిన భార్య.. కారణం తెలిస్తే హడలిపోతారు..!

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:20 PM

ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఇంటికొచ్చిన భర్తను పొట్టు పొట్టుగా కొట్టిందో భార్య. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ ఆగ్రహంతో రలిగిపోయిన ఆమె.. తన భర్తను ఇటుకతో కొట్టి తల పగలకొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రారం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Wife Hits Husband

లక్నో, జూన్ 21: ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఇంటికొచ్చిన భర్తను పొట్టు పొట్టుగా కొట్టిందో భార్య. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ ఆగ్రహంతో రలిగిపోయిన ఆమె.. తన భర్తను ఇటుకతో కొట్టి తల పగలకొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రారం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


రాంపూర్‌లోని షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేతి గ్రామానికి చెందిన మనోజ్, బబిత భార్యా భర్తలు. మనోజ్ హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కి వెళ్లాడు. కటింగ్ చేయించుకుంటున్న సమయంలో అతని భార్య బబిత అతనికి ఫోన్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. కటింగ్ చేయించుకున్న తరువాత మనోజ్ తన ఇంటికి వెళ్లాడు. అయితే, ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంగా అప్పటికే ఆగ్రహంగా ఉన్న బబిత.. మనోజ్ రావడం రావడంతోనే ఘర్షణకు దిగింది. మరింత కోపోద్రిక్తురాలైన బబిత పక్కనే ఉన్న ఇటుక తీసుకుని మనోజ్ తలపై బలంగా కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు మనోజ్. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే, పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. దంపతులిద్దరినీ కలిపారు. భార్య, భర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికీ సర్ది చెప్పగా.. వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇద్దరూ కలిసి ఉంటామని.. ఘర్షణలకు దిగబోమని చెప్పారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు సైతం తెలిపారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 21 , 2024 | 04:20 PM

Advertising
Advertising