Rains: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:13 PM
దేశంలోని పలు ప్రాంతాలను చలి వణికిస్తుంది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు, పశ్చిమ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని తెలిపింది. అంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని అంచనా వేస్తుంది. ఇక వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. సోమవారం ఉదయం పంజాబ్, హర్యానా, వాయువ్య రాజస్థాన్‌తోపాటు బీహార్‌లో దట్టమైన పొగమంచు కప్పుకుని ఉంటుందని తెలిపింది.
Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
ఇక నవంబర్ 17వ తేదీ.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. వారం రోజుల పాటు అండమాన్, నికోబార్ దీవులలో చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
దట్టమైన పొగమంచు
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నవంబర్ 18వ తేదీ ఉదయం బీహార్‌లో పొగమంచు పడుతుందని తెలిపింది. అదే విధంగా నవంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాంతోపాటు మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. న్యూఢిల్లీలో .. ఎన్‌సీఆర్‌లో చలి విజృంభించింది. దీంతో ఢిల్లీ వాసులకు ఉదయం, సాయంత్రం వేళల్లో చలి మొదలైంది. అలాగే శీతాకాలం కావడంతో భారీగా మంచు పడుతుంది. ఉదయం పూటి దట్టమైన పొగ మంచు సైతం కప్పేస్తుంది.
ఇక పర్వత ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుంది. దీనిని ఆస్వాదించేందుకు పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరోవైపు భారీగా మంచు పడుతుంది. దీంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే దాదాపు 30 రైళ్లు సైతం చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
For National News And Telugu News