Weather Updates: బాబోయ్ ఎండలు.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త.. ఐఎండీ రెడ్ అలర్ట్..
ABN, Publish Date - May 02 , 2024 | 04:04 PM
IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం..
IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం ఉంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో బానుడు భగభగ మండుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో మే 2వ తేదీ నుంచి హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. బీహార్, తెలంగాణ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలలో మే 6వ తేదీ వరకు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, జార్ఖండ్ రాష్ట్రంలో హీట్ వేవ్ పిరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
తీవ్రమైన హీట్‌వేవ్..
గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గానీ.. సాధారణం కంటే 4.5 డిగ్రీలు మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్‌వేవ్‌గా ప్రకటిస్తారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి.. సాధారణం కంటే 6.5 డిగ్రీలు దాటి ఎక్కువ నమోదైతే తీవ్రమైన హీట్‌వేవ్‌గా ప్రకటిస్తారు.
8 రాష్ట్రాల్లో వర్షపాతం..
కొన్ని రాష్ట్రాలు ఎండలతో అల్లకల్లోలం అవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ రాష్ట్రాలలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ. అదే సమయంలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
For More National News and Telugu News..
Updated Date - May 02 , 2024 | 04:25 PM