ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:24 PM

దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.

"ఉద్యోగాల కల్పనపై మోదీ అన్ని అబద్ధాలే చెప్పారు. నేషనల్‌ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(NRA) కోట్ల మంది యువకులు వరం. ఇది అనేక పరీక్షలను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అభ్యర్థుల సమయం, వనరులను ఆదా చేస్తుంది.

పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ నాలుగేళ్లలో ఎన్ఆర్ఏ ఒక్క పరీక్షా నిర్వహించలేదు. బడ్జెట్‌లో నిర్వహణకు కేటాయించిన మొత్తం రూ.1,517 కోట్లలో, రూ. 58 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎన్‌ఆర్‌ఏ ఉద్యోగాల నియామకానికి ఏర్పాటు చేశారా? లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లు లాక్కోవడానికి చేశారా? ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పరీక్షలను తారుమారు చేయడానికి, పేపర్‌లను లీక్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఎన్టీఏ కూడా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. యువకుల భవిష్యత్తును నాశనం చేయడమే వారి లక్ష్యం" అని ఖర్గే విమర్శించారు.


ప్రధాని మోదీ శనివారం ముంబయిలోని ఓ కార్యక్రమంలో పాల్గొని రిజర్వు బ్యాంక్‌ రిపోర్టు ప్రకారం 2023-24లో దేశంలో 4.7 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొత్తంగా నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ఉద్యోగాలపై అసత్యాలు ప్రచారం చేసేవారిని మాట్లాడనివ్వకుండా చేసిందని ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత


For Latest News and National News click here

Updated Date - Jul 14 , 2024 | 05:27 PM

Advertising
Advertising
<