Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?
ABN, Publish Date - Apr 06 , 2024 | 03:31 PM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పోటీ చేసే స్థానంపై స్తబ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ కేటాయింపుపై కూటమి బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే కల్యాణ్ లోక్ సభ నుంచి అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.
ముంబై: లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సీట్ల ఖరారు ప్రక్రియ కొన్ని చోట్ల ఆలస్యం అవుతోంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాల ఆధారంగా ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కుమారుడు శ్రీకాంత్ షిండే పోటీ చేసే స్థానంపై స్తబ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో కల్యాణ్ (Kalyan) లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ కేటాయింపుపై కూటమి బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే కల్యాణ్ లోక్ సభ నుంచి అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.
సీటు కోసం పోటీ..?
కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీపై శివసేన- బీజేపీ మధ్య చర్చలు జరిగాయి. శివసేనతో పోల్చితే కల్యాణ్ లోక్ సభ పరిధిలో తమ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగంగా మాట్లాడారు. కల్యాణ్ నుంచి శ్రీకాంత్‌కు టికెట్ ఇస్తే పనిచేయమని స్థానిక బీజేపీ నేతలు ప్రకటించారు. అలా చెప్పిన నేతలు అంతా బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ అనుచరులు. గణపతి గైక్వాడ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఓ ఆస్తి వివాదం, రాజకీయ అంశంతో ముడిపడి ఉన్న అంశంలో శివసేన నేతపై కాల్పులు జరిపారు. ఆ శివసేన నేత శ్రీకాంత్ షిండేకు అత్యంత సన్నిహితుడనే సంగతి తెలిసిందే.
ఫడ్నవీస్ క్లారిటీ
కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆ అంశంపై మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టత ఇచ్చారు. కల్యాణ్ నుంచి శ్రీకాంత్ షిండే బరిలోకి దిగుతారని ప్రకటించారు. శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ వ్యతిరేకించదని స్పష్టం చేశారు. కల్యాణ్ నుంచి ఉమ్మడి అభ్యర్థి శ్రీకాంత్ అని తెలిపారు. శ్రీకాంత్ వెంట బీజేపీ ఉంటుందని, గతంలో కంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తేల్చి చెప్పారు. ఫడ్నవీస్ ప్రకటనతో కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గంపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. మరి అక్కడ బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తారా అనే సందేహాం మాత్రం అలానే ఉంది.
ఇవి కూడా చదవండి:
West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం
Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 06 , 2024 | 03:31 PM