ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: చింద్వారా నుంచే బరిలోకి.. తేల్చిచెప్పిన కమల్ నాథ్

ABN, Publish Date - Mar 11 , 2024 | 02:44 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తమ కంచుకోట చింద్వారా లోక్ సభ నియోజకవర్గాన్ని వీడనని తేల్చిచెప్పారు. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సోమవారం కమల్ నాథ్ స్పందించారు. నకుల్ జబల్ పూర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చింద్వారాను తాము వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు.

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamal Nath) తన కంచుకోట చింద్వారా లోక్ సభ నియోజకవర్గాన్ని వీడనని తేల్చిచెప్పారు. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దాంతో సోమవారం కమల్ నాథ్ (Kamal Nath) స్పందించారు. నకుల్ జబల్ పూర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చింద్వారాను తాము వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బీజేపీలో చేరిన నేతలు తమ అభీష్టం మేరకు పార్టీ మారారని కమల్ నాథ్ అభిప్రాయ పడ్డారు.

కంచుకోట

చింద్వారా లోక్ సభ నియోజకవర్గం కమల్ నాథ్ కంచుకోట. 1980 నుంచి తొమ్మిదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అతని కుమారుడు నకుల్ నాథ్ ఒకసారి గెలిచారు. 1980, 1984, 1989, 1991, 1998, 1999, 2004, 2009, 2014లో కమల్ నాథ్ గెలుపొందారు. 1997లో ఒకసారి కమల్ నాథ్ ఓడిపోయారు. మద్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్ లాల్ పాట్వా చేతిలో ఓడిపోయారు. 2019లో కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ బరిలోకి దిగారు. 37,536 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సారి కూడా తాను చింద్వారా నుంచి బరిలోకి దిగుతానని నకుల్ నాథ్ ప్రకటించారు. ఇంతలో అతని గురించి రూమర్స్ రావడంతో కమల్ నాథ్ స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 03:35 PM

Advertising
Advertising