సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:51 AM
త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 33 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యార్థులకు...

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 33 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యార్థులకు సీబీఎ్‌ససీ విద్యతోపాటు, క్రమశిక్షణ, భౌతిక నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇస్తారు. ఈ పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల నోటిఫికేషన్(ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2025) వెలువడింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర అకాడమీల్లో చేరడానికి సిద్దం అవుతారు. ‘ఏఐఎ్‌సఎ్‌సఈఈ’ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ 2025 జనవరి 13.
6వ తరగతి: 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు (2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31లోపు జన్మించి) ఉండాలి.
9వ తరగతి: 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు (2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31లోపు జన్మించి) ఉండాలి.
పరీక్షా విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ద్వారా నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా రాత విధానంలో ఉంటుంది. ఆరో తరగతి పరీక్ష అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. దీనిని రెండున్నర గంటల్లో రాయాలి. తొమ్మిదో తరగతి పరీక్ష ఇంగ్లీషులో మాత్రమే నిర్వహిస్తారు. దీనిని విద్యార్థులు మూడు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: https://aissee.nta.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కుల, నివాస, జనన ధృవీకరణ సర్టిఫికెట్‌లతోపాటు పాస్‌పోర్ట్ ఫోటో అవసరం అవుతాయి. జనరల్, ఓబీసీ, డిఫెన్స్ కేటగిరీ వారికి రూ.800/- ఫీజు, ఎసీ, ఎస్టీ విద్యార్థులకు 650/- ఫీజు ఉంటుంది.
సైనిక్ స్కూల్స్: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం రెండు సైనిక పాఠశాలలు ఉన్నాయి. ఒకటి విజయనగరం జిల్లాలోని కోరుకొండ, చిత్తూరు జిల్లాలోని కలికిరి. దీనిలో 65 స్థానిక విద్యార్థులకు, మిగిలిన 35 శాతం జాతీయ కోటాలోకి వెళుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి స్కూల్స్‌తోపాటు జాతీయ కోటా 35 శాతం(అంటే దాదాపు 400 సీట్ల)కి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్ ప్రాసెస్: ప్రవేశ పరీక్ష పూర్తయిన 45 రోజుల లోపు స్కోర్ కార్డు ఇంటికి వస్తుంది. ఇందులో అర్హత పొందిన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇది దాదాపు 8 రౌండ్లుగా ఉంటుంది.
ప్రిపరేషన్: ఆరో తరగతి: ప్రధానంగా ఐదో తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. మొత్తం మార్కులు 200(మేథ్స్: 50, జనరల్ నాలెడ్జ్: 50, ఇంగ్లిష్: 50, జనరల్ ఇంటెలీజెన్స్: 50)
తొమ్మిదో తరగతి: మొత్తం మార్కులు 400( మేథ్స్: 200, సైన్స్: 50, ఇంగ్లిష్: 50, ఇంటెలీజెన్స్: 50, సోషల్: 50)
(ప్రతీ సబ్జెక్టులో కనీసం 25 శాతం మార్కులు రావాలి. టోటల్‌గా కనీసం 40 శాతం మార్కులు రావాలి)
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ఎస్.కళ్యాణి
ప్రిన్స్‌పాల్, కాంత్రి కీన్ అకాడమి, హైదరాబాద్
కలికరి స్కూల్ - మొత్తం సీట్లు 105
స్థానిక కోటా బాలురు బాలికలు
ఎస్సీ 10 1
ఎస్టీ 04 1
ఓబీసీ 18 1
డిఫెన్స్ 08 1
జనరల్ 26 1
(మిగిలిన సీట్లు జాతీయ కోటా కిందకు వెళతాయి)
కోరుకొండ స్కూల్ - మొత్తం సీట్లు 93
స్థానిక కోటా బాలురు బాలికలు
ఎస్సీ 08 1
ఎస్టీ 04 1
ఓబీసీ 16 1
డిఫెన్స్ 07 1
జనరల్ 22 1
(మిగిలిన సీట్లు జాతీయ కోటా కిందకు వెళతాయి)