Ayurveda Suggests : వంద అడుగుల నడక
ABN, Publish Date - Jul 30 , 2024 | 12:27 AM
ఆరోగ్యంగా, చురుగ్గా, దృఢంగా ఉండాలంటే తినే ఆహారంతో పాటు, ఆహారం తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
ఆయుర్వేదం
ఆరోగ్యంగా, చురుగ్గా, దృఢంగా ఉండాలంటే తినే ఆహారంతో పాటు, ఆహారం తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
షట్‌పావ్లీ మరాఠీ పదం. షట్ అంటే వంద అనీ, పావ్లీ అంటే అడుగులు అని అర్థం. వంద అడుగుల నడక జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రాచీన కాలంలో ఈ అలవాటును అనుసరించేవారు. భోజనం తర్వాత వంద అడుగులు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు, క్యాలరీలు కూడా కరుగుతాయి. రక్తంలోని చక్కెరలు అదుపులో ఉండి, తిన్న ఆహారం జీర్ణమై, పోషకాలు శోషణ చెందుతాయి. భోజనం తదనంతర నడకతో రక్తంలోని చక్కెర మోతాదులు తగ్గుతాయనీ, తద్వారా టైప్2 మధుమేహ ప్రభావం శరీరం మీద పడకుండా ఉంటుందని జోర్నల్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.
అయితే కొందరికి భోజనం తర్వాత కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఇలా కునుకు తీయడం వల్ల శరీరంలో కఫం, మేదం (కొవ్వు) పేరుకుని, మెటబాలిజం నెమ్మదిస్తుందని, తద్వారా తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదనీ ఆయుర్వేదం చెప్తోంది.
భోజనం తర్వాత ఈత, దూరాలు నడవడం, ప్రయాణం, వ్యాయామం చేయడం వల్ల వాతం పెరిగి, జీర్ణప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. దాంతో కడుపుబ్బరం, శోషణ అసంపూర్తిగా జరగడం, పొట్టలో అసౌకర్యం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఈ అలవాట్లకు స్వస్థి చెప్పాలి.
Updated Date - Jul 30 , 2024 | 12:57 AM