Benefits of Vitamin C : చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?
ABN , Publish Date - Jul 23 , 2024 | 04:11 PM
సూర్యరశ్మి, మొటిమలు మందుల వల్ల చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ విటమిన్ సి తో తగ్గుతాయి.
చర్మానికి ఎంత పోషణను అందిస్తే అంత మెరుస్తుంది. చర్మం సౌందర్యం పెరగాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. చర్మం నిగారింపు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. చర్మక్యాన్సర్ వంటి ప్రమాదాన్ని ఆరోగ్య పరిస్థితలను తగ్గించడానికి చర్మ సంరక్షణ అంతే అవసరం. విటమిన్ సి చర్మం సంరక్షణను సహజంగా కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి సప్లిమెంట్స్ రూపంలో తీసుకున్న, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నా కూడా చర్మానికి నిగారింపును అందిస్తుంది.
ఇది పర్యావరణ కాలుష్యకారకాలను, అతినీలలోహిత వికిరణానికి గరురైన తర్వాత కనిపించే ఆక్సిడెంట్లు తొలగించేందుకు సహకరిస్తుంది. విటమిన్ సి సీరం లేదా లోషన్ కూడా చర్మంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని నియంత్రించడానికి, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి సూచిస్తుంది. విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తారు.
Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!
సూర్యరశ్మి, మొటిమలు మందుల వల్ల చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ విటమిన్ సి తో తగ్గుతాయి. హైపర్ పిగ్మెంటేషన్ ముఖం మీద ముడతులు తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాలకు ఎక్కువ కాలం గురికావడం వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. ఇది ముడతలు ఏర్పడేలా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ సి బాగా పనిచేస్తుంది. విటమిన్ సి చర్మం నీటిని నిలుపుకోవటానికి, తేమగా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ సి చర్మం కాలిన లేదా ఇతర గాయం నుండి నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!
చర్మం వృద్ధాప్యం నుంచి, కాలుష్యం, సూర్యరశ్మి వంటి బయటి శత్రువుల నుండి కాపాడేందుకు సరైన పోషణకావాలి. హాని కలిగించే ఫ్రీరాడికల్స్, అస్థిర అణువులను నంచి చర్మాన్ని కాపాడేందుకు విటమిన్ సి పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ చర్మం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. విటమిన్ సి పోరాడుతుంది. ఇది చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని రక్షించడానికి, పెంచడానికి పోషణను అందించే ప్రోటీన్.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.