Share News

summer skin care : వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:11 PM

ముఖంలోని అదనపు జిడ్డును తొలగించేందుకు ఫేస్ వాష్‌లు తప్పనిసరి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది, తద్వారా దుమ్ము, ధూళిని తొలగిపోతుంది.

summer skin care : వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
Summer Skin

వేసవిలో జిడ్డు చర్మం ఎక్కువగా ఉంటుంది. డ్రై స్కిన్ లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నా సరే, ఎల్లప్పుడూ కొంత జిడ్డు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని నివారించడానికి, తప్పనిసరిగా సల్ఫేట్ లేని ఫేస్ వాష్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. ముఖంలోని అదనపు జిడ్డును తొలగించేందుకు ఫేస్ వాష్‌లు తప్పనిసరి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది, తద్వారా దుమ్ము, ధూళిని తొలగిపోతుంది. పొడి చర్మం ఉన్నట్లయితే, తేలికపాటి ఫోమింగ్ క్లెన్సర్‌ని ఉపయోగించాలి.


జిడ్డు చర్మం ఉన్నవారు, బొగ్గు, కాఫీ మొదలైన పదార్థాలను ఉపయోగించినా సరే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేసవి చర్మ సంరక్షణలో భాగంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలతో శరీరాన్ని, చర్మాన్ని వేడి నుంచి కాపాడుకోవచ్చు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే..!

రోజూ సన్ స్క్రీన్ లోషన్..

హానికరమైన UVకిరణాల నుంచి సన్ స్క్రీన్ ఉత్తమ రక్షణనిస్తుంది. ఇది SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ సెక్ట్రమ్ సమ్ స్క్రీన్ ని ఎంచుకోవాలి. ఇది చర్మాన్ని వేడి నుంచి రక్షిస్తుంది.

హైడ్రేటెడ్ గా ఉండేందుకు..

చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి.

తేలికపాటి.. మాయిశ్చరైజర్లను.. చర్మాన్ని తేలికైన, నూనె మాయిశ్చరైజర్‌లను ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!


క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేట్... చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అడ్డుపడే రంధ్రాలను నివారిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

పెదవులకు..

చర్మంలాగే పెదవులకు కూడా వడదెబ్బకు గురవుతాయి. సూర్యుని కిరణాల నుండి పెదవులను రక్షించడానికి SPF లిప్ బామ్‌ను ఉపయోగించాలి.

సాధారణంగా వేసవి తాపం నుంచి తప్పించుకోవాలంటే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆరుబయట ఉండకపోవడమే మంచిది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 29 , 2024 | 04:11 PM