Share News

Littles : దుప్పి తెలివి

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:15 AM

అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.

Littles : దుప్పి తెలివి

Littles :నగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.

కాసేపయాక గుహ బయటకు తొంగి చూస్తే, బయట ఒక పులి నించుని గుహవైపే చూస్తూ కనిపించింది. గుహ లోపల చీకటిగా ఉండటంతో తాను పులికి కనిపించే అవకాశం లేదని కొంత ధైర్యం తెచ్చుకున్న దుప్పి ఏదో ఒకలాగా అక్కడి నుండి బయట పడితేగానీతన ప్రాణాలు దక్కవ అనుకున్నది. గుహ లోపలికి జరిగి, గంభీరంగా గొంతు మార్చి ఇలా అన్నది. మన ముగ్గురం పులిని వేటాడి తిని చాలా కాలమైంది ఈ సమయంలో పులి ఏదైనా కనపడితే, మన పంట పండినట్టే. అన్నట్టు పులి గుండె మాత్రం నేనే తింటాను ఇప్పటికి తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నాను. ఇవాళ వంద పూర్తి చేస్తాను’అన్నది. ఆ మాటలన్నీ గుహ బయట ఉండి విన్న పులి గుహ లోపల తనను వేటాడి తినగల పెద్ద జంతువు ఏదో ఉందనుకుని భయ పడింది.

మరికొంత సేపటికి అక్కడికి ఒక తోడేలు వచ్చి, ఏమిటి అలా భయపడుతూ నించున్నావు? అని అడిగింది, దానికి పులి జవాబు చెప్పే లోపలే గుహ లోపల నుండి దుప్పి మళ్లీ గొంతు మార్చి,‘ మీరిద్దరూ ఇక్కడే ఉండండి ఇవాళ పులి దొరక్కపోతే ఒక తోడేలు దొరికినా

మన ఆకలి తీరినట్టే’ అన్నది. ఆ మాటలు వినగానే పులి ,తోడేలు రెండూ కలసి అక్కడినుండి అడవిలోకి పరుగు తీశాయి. అలా తెలివైన దుప్పి రాకీ తన ఉపాయంతో ఆ రోజు పులిమరియు తోడేలు బారినుండి తన ప్రాణాలను కాపాడుకుంది.

Updated Date - Oct 05 , 2024 | 12:15 AM