Share News

Story : ఎదుటి వారిని హేళన చేసిన ఫలితం

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:10 AM

ఒక ఊరిలో శేషయ్య అనే వ్యాపారి దగ్గర ఒక గుర్రం,ఒక గాడిద ఉండేవి.అతను తరచూ పక్క ఊరిలోని సంతకు వెళ్లి, సరుకులు కొని, వాటి మూటలు గాడిద మీద వేసుకుని, తాను గుర్రం మీద ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒక పెద్ద పండగ కు ముందురోజు శేషయ్య పట్నానికి వెళ్లి, చాలా సరుకులు కొని, వాటన్నిటి మూటలు గాడిద

Story : ఎదుటి వారిని హేళన చేసిన ఫలితం

ఒక ఊరిలో శేషయ్య అనే వ్యాపారి దగ్గర ఒక గుర్రం,ఒక గాడిద ఉండేవి.అతను తరచూ పక్క ఊరిలోని సంతకు వెళ్లి, సరుకులు కొని, వాటి మూటలు గాడిద మీద వేసుకుని, తాను గుర్రం మీద ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒక పెద్ద పండగ కు ముందురోజు శేషయ్య పట్నానికి వెళ్లి, చాలా సరుకులు కొని, వాటన్నిటి మూటలు గాడిద మీద వేసి, ఎప్పటి లాగే తాను గుర్రం ఎక్కి కూర్చున్నాడు ఆ రోజు బరువులు చాలా ఎక్కువ అవడంతో, గాడిద తట్టుకోలేక నెమ్మదిగా నడుస్తూ. ఇబ్బంది పడుతోంది, ఆ విషయం గమనించిన గుర్రంగాడిదను చూసి నవ్వింది. గాడిద బాధ పడుతూ, కొంచెం బరువును పంచుకోమని గుర్రాన్ని ప్రాధేయ పడింది. దానికి గుర్రం‘ నేనేమీ గాడిదను కాదు బరువులు మోయడానికి.నేను మనుషులు స్వారీ చేయడానికే తప్ప, బరువులు మోయడం లాంటి తక్కువ స్థాయి పనులు చేయను’ అని పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విని బాధ కలిగినా గాడిద చేసేదేమీ లేక ముందుకు నడిచింది. కొంత దూరం నడిచాక ఆ బరువులు మోయడం ఇక గాడిద వల్ల కాలేదు అది నీరసంతో ఒక్కసారిగా నించున్న చోటనే కుప్ప కూలిపోయి మరలా లేవలేక పోయింది. అపుడు వ్యాపారి చేసేదేమీ లేక గాడిద వీపు మీది బరువును గుర్రం మీదకు మార్చి, తవాటితో పాటు తాను కూడా గుర్రం మీదనే కూర్చున్నాడు. అపుడు గుర్రం ‘ పాపం గాడిద ఇంత బరువు మోయలేకనే ఇబ్బంది పడింది కాబోలు,అనవసరంగా అది సాయం అడిగినపుడు ఎగతాళి చేసి మాట్లాడాను. ఇపుడు యజమాని బరువు, సరుకుల వరువు మోస్తుంటే అర్థం అవుతుతంది గాడిద రోజూ ఎంత కష్టపడేది. మరెప్పుడూ సాయం అడిగిన ఎవరినీ హేళనగా మాట్లాడకూడదు’ అనుకుంది.

Updated Date - Oct 10 , 2024 | 01:10 AM