Share News

Story : అనాలోచిత చర్య ఫలితం

ABN , Publish Date - Oct 11 , 2024 | 07:20 AM

ఒక చెరువు దగ్గర చిన్న కప్ప మరియు ఎలుక ఎంతో స్నేహంగా మసలుకుంటూ ఉండేవి. వాటి మధ్య ఎలాంటి భేదాలు లేని స్నేహంఉండేది.రోజూ కప్ప

Story : అనాలోచిత చర్య ఫలితం

ఒక చెరువు దగ్గర చిన్న కప్ప మరియు ఎలుక ఎంతో స్నేహంగా మసలుకుంటూ ఉండేవి. వాటి మధ్య ఎలాంటి భేదాలు లేని స్నేహంఉండేది.రోజూ కప్ప చెరువులో నుండి బయటకు వచ్చి,ఎలుకతో సరదాగాకబుర్లు చెప్పి, కాసేపు ఆటపాటతో కాలం గడిపి వెళుతూఉండేది. అంత మంచి మిత్రుల మధ్య కూడా ఒకసారి భేదాలు వచ్చాయి.దానికి కారణం కప్ప ఎలుకను అపార్థంచేసుకోవడమే. ఎపుడూతాను ఎలుక కలుగు దగ్గరకు వెళ్లడమే తప్ప, ఎలుక తన దగ్గరకు రాదు కాబట్టి ఎలుకకు పొగరుఅని కప్పఅనుకున్నది. ఒకరోజు ఎలుకకు మంచి గుణపాఠం చెప్పాలిఅనుకున్నది. ఎలుక కలుగు దగ్గరికి వెళ్లి వస్తూ తన కాలికి ఎలుక తోకను తాడుతో గట్టిగా కట్టేసింది. ఎలుక ఇది గమనించుకోలేదు అలవాటుగా కప్ప గెంతుతూ చెరువు లోకి పోగానే, దానితో పాటు, ఎలుక కూడా రావలసి వచ్చింది. నీటిలో ఎలా ఈదాలో తెలియని ఎలుక ఎగిరి కప్ప వీపుపైన కూర్చుంది. ఆ బరువు కప్ప ఎక్కువ సేపు మోయలేక ఇబ్బంది పడింది. పైనుండి ఈ రెంటినీ గమనిస్తున్న గద్ద ఒకటి వేగంగా ఎగురుతూ వచ్చి, రెండిటినీ తన చెట్టు మీదకు తన్నుకుని పోయింది. కప్ప చేసిన అనాలోచిత చర్య వలన తనప్రాణాలే కాక తనను నమ్మి స్నేహం చేసిన ఎలుక ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి, అందుకే ముందూ వెనుకలు ఆలోచించకుండా ఎవరికీ అపకారం తలపెట్టకూడదు.

Updated Date - Oct 11 , 2024 | 07:20 AM